Brahmaji: ప్రపంచాన్ని చుట్టాలనే పిచ్చితో తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి, చివరకు ప్రకాష్ రాజ్ దగ్గర అప్పు తీసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటనను నటుడు బ్రహ్మాజీ పంచుకున్నారు. ప్రయాణాల పట్ల ఆయనకున్న అమితమైన ఇష్టాన్ని గురించి ఇక్కడ చదవండి.
తమ దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి వెళ్ళిన యూరోప్ ట్రిప్ జ్ఞాపకాన్ని నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. స్విట్జర్లాండ్ అందాలను చూస్తూ తన భార్యతో కలిసి గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని అన్నారు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతున్నా ఆ అనుభవం ముందు అది చిన్నదే అని ఆయన పేర్కొన్నారు.
25
ప్రకాష్ రాజ్ తో స్నేహం:
ఆపదలో ఆదుకున్న మిత్రుడు ప్రకాష్ రాజ్. అకౌంట్ లో డబ్బులు లేనప్పుడు కేవలం ఒక్క ఫోన్ కాల్ తో లక్ష రూపాయలు పంపిన ప్రకాష్ రాజ్ గొప్ప మనసును నటుడు బ్రహ్మాజీ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య స్నేహం అలాంటిదని.. అతడు వెంటనే డబ్బులు అకౌంట్‌కు వేశాడన్నారు.
35
"ప్రపంచం మొత్తం చూసేయాలి"
"ప్రపంచం మొత్తం చూసేయాలి" అనేదే తన జీవిత లక్ష్యం అని బ్రహ్మాజీ అన్నారు. డబ్బు సంపాదించడం దేనికైనా కావచ్చు, కానీ తనకు మాత్రం దానితో ప్రపంచం చుట్టేయాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రయాణాల పిచ్చి తనకు ఒక రకమైన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
ప్రయాణం అంటే తనకు, తన భార్యకు ఇద్దరికీ ఇష్టం అని.. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ప్రపంచాన్ని చూడగలుగుతున్నానని బ్రహ్మాజీ చెప్పారు. ఆమె కూడా ఎప్పుడూ బ్యాగ్ సర్దుకుని సిద్ధంగానే ఉంటారన్నారు.
55
ట్రావెలే ప్యాషన్
డబ్బులు లేకపోయినా ప్రకాష్ రాజ్ దగ్గర అప్పు అడిగిన విషయాన్ని ఎంతో నిజాయితీగా చెప్పారు బ్రహ్మాజీ. ప్రయాణాల పట్ల ఆయనకున్న ఆ ప్యాషన్, ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆనందం మనం అర్ధం చేసుకోవచ్చు. సంపాదన కంటే అనుభవాలే ముఖ్యమని ఆయన మాటలు చెబుతున్నాయి.