దుబాయ్ లో రాజమౌళి-మహేష్ భేటీ ముగిసిన నేపథ్యంలో ఇండియా వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్, రాజమౌళి, కే ఎల్ నారాయణ కనిపించారు. కాగా మహేష్ లుక్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంది. ఆయన పెరిగిన జుట్టు, గడ్డంతో మాస్ గా కనిపించారు. రాజమౌళి తన హీరోల లుక్ గొప్పగా డిజైన్ చేస్తాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటాడు.