16 ఏళ్లకే హీరోయిన్..1300 కోట్ల ఆస్తి.. 8 ఏళ్లుగా నటనకు దూరం.. ఎవరా హీరోయిన్ తెలుసా..?

Published : Jun 07, 2024, 01:40 PM IST

చాలా చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది... స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెయ్యి కోట్లకుపైగా ఆస్తిని సంపాదించుకుంది... ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

PREV
18
16 ఏళ్లకే హీరోయిన్..1300 కోట్ల ఆస్తి.. 8 ఏళ్లుగా నటనకు దూరం.. ఎవరా హీరోయిన్ తెలుసా..?

ఈ ఫోటోలో చిన్నారిని చూశారా.. ఈమె ఒ హీరోయిన్.. హీరోయిన్ల లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అని సామెత చెప్పినట్టు.. మూవీ కెరీర్ ఉండగానే గట్టిగా సంపాదించి పెట్టుకోవాలి.. అది పేరు అయినా.. డబ్బు అయినా.. ఈ విషయంలోకొంత మంది హీరోయిన్లు పార్ములాను కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఆ కోవలోకే వస్తారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారు ఆమెనే.. 

28

ఇంతకీ ఆ నటి  ఎవరో కాదు.. అసిన్. చాలా చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంటే 15.. 16 ఏళ్లకే హీరోయిన్ గా ఆసిన్ హీరోయిన్ గా మారింది.  కేరళలోని కొచ్చికి చెందిన కుటుంబంలో ఆమె పుట్టారు.  చిన్నప్పటి నుంచి కేరళలో మోహిని అథం, భరతం వంటి సంప్రదాయ నృత్య రూపాలను నేర్చుకుని, ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆసిన్.
 

38

2001లో.. ఆమెకు  15 ఏళ్ల వయసులో రిలీజ్ అయిన  మలయాళ సినిమా నరేంద్రన్ మగన్ జయకాంతన్ వగా మకన్ సినిమాలో  తొలిసారిగా నటించింది ఆసిన్. ఈసినిమా ఆమె మొదటి సినిమా.. కమర్షియల్‌గా విజయం సాధించింది. 

48
Asin

దీని తర్వాత 2003లో తెలుగులో వచ్చిన 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి అసిన్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈసినిమాతో టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కొన్నిరోజుల్లోనే ఆమె బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 

58

మంచి మంచి కథలు ఎంచుకుంటూ.. వరుస హిట్లు సొంతం చేసుకుంది బ్యూటీ.. ముఖ్యంగా తెలుగులో రవితేజ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల తో హిట్ సినిమాలు చేసింది ఆసిన్. అటు తమిళంలో విజయ్ , అజిత్, సూర్య,  విక్రమ్ సరసన వరుస సినిమాలు చేసి.. రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

68

హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈబ్యూటీ.. చేతినిండ సంపాదించుకుంది. బాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో మెరిపించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి నటుల సరసన నటించే అవకాశం వచ్చింది. నటిగా బిజీగా ఉన్న టైమ్ లోనే పెళ్ళి చేసుకుంది ఆసిన్. 
 

78

సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడింది. డేటింగ్ చేసింది..  ఆ తర్వాత 2016లో అతడిని పెళ్లి చేసుకుంది ఆసిన్. పెళ్లి తర్వాత రాహుల్ శర్మ కుటుంబం పెట్టిన షరతు మేరకు అసిన్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. 

88
Asin

ప్రస్తుతం ఆసిన్ కుటుంబానికే పరిమితం అయ్యింది. ఈ దంపతులకు  ఆరిన్ అనే 6 ఏళ్ల కూతురు ఉంది. అసిన్ ఆస్తి విలుపు ప్రస్తుతం  1300 కోట్లకు పైగా ఉంటుుందని అంచనా. , ఆమె తన పుట్టినరోజున మాత్రమే తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. గత 8 ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న అసిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 

click me!

Recommended Stories