ప్రభాస్ కి వర్షం తర్వాత అంత బాగా నచ్చిన మూవీ సాంగ్స్ ఏవో తెలుసా..మెగా హీరో సినిమా పేరు చెప్పిన రెబల్ స్టార్

Published : Jun 07, 2024, 01:34 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మిర్చి చిత్రం స్పెషల్ మూవీ గా నిలిచిపోతుంది. బాహుబలి చిత్రానికి కమిటైన సమయంలో ప్రభాస్ మిర్చి చిత్రానికి కూడా అంగీకరించాడు. కొరటాల శివ ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా మారారు. 

PREV
16
ప్రభాస్ కి వర్షం తర్వాత అంత బాగా నచ్చిన మూవీ సాంగ్స్ ఏవో తెలుసా..మెగా హీరో సినిమా పేరు చెప్పిన రెబల్ స్టార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మిర్చి చిత్రం స్పెషల్ మూవీ గా నిలిచిపోతుంది. బాహుబలి చిత్రానికి కమిటైన సమయంలో ప్రభాస్ మిర్చి చిత్రానికి కూడా అంగీకరించాడు. కొరటాల శివ ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా మారారు. కొరటాల టేకింగ్, ప్రభాస్ మాస్ అండ్ క్లాస్ గా కనిపించిన విధానం.. దేవిశ్రీ ప్రసాద్ సంగీత ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. 

 

26

ఈ చిత్ర సమయంలో ప్రభాస్ మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. దేవిశ్రీ ప్రసాద్ చాలా చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. కానీ ప్రతి చిత్రంలో దేవిశ్రీ సాంగ్స్ లో ఉండే సౌండింగ్ తనని సర్ప్రైజ్ చేస్తుంది అని ప్రభాస్ అన్నారు. 

 

36

వర్షం చిత్రానికి దేవిశ్రీ తిరుగులేని సాంగ్స్ ఇచ్చారు. వర్షం ఆల్బమ్ నా ఆల్ టైం ఫేవరేట్అని ప్రభాస్ తెలిపారు. ఆ తర్వాత జల్సా సాంగ్స్ విన్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ సాంగ్స్ లో సౌండింగ్ సరికొత్తగా ఉంటుంది. జల్సా సాంగ్స్ కూడా నాకు ఫేవరిట్ గా మారిపోయాయి. ఆ సౌండింగ్ లో వేరియేషన్స్ చూపించడం దేవిశ్రీ కి మాత్రమే సాధ్యం అని ప్రభాస్ తెలిపాడు. 

 

46

మిర్చి చిత్రంలో పండగలా దిగివచ్చాడు సాంగ్ ని ఫస్ట్ టైం వినగానే నచ్చేసింది. ఆ తర్వాత ఆ పాటని 150 సార్లు విన్నట్లు ప్రభాస్ తెలిపారు. దేవిశ్రీ స్టైల్ కి భిన్నంగా ఉండే సాంగ్ అది. 

 

56

కొరటాల శివ, తాను ఆ సాంగ్ విని ఆశ్చర్యపోయినట్లు ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ జల్సా సినిమా పేరు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అప్పట్లో ఫుల్ ఖుషి అయ్యారు. దేవీశ్రీ ప్రసాద్ బెస్ట్ ఆల్బమ్స్ లో వర్షం, జల్సా తప్పనిసరిగా ముందు వరుసలో ఉంటాయి. 

 

66

ప్రభాస్ దేవీశ్రీ కాంబినేషన్ లో వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్, పౌర్ణమి, మిర్చి లాంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ప్రభాస్ సినిమాకి సంగీతం అందించడం ఎప్పుడూ తనకి కొత్త అనుభూతి ఇస్తుందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories