ఆ ఛాన్స్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను.. అనుపమా పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్..

Published : Jul 09, 2023, 06:47 PM IST

అవ్వడానికి మలయాళీ అమ్మాయే అయినా.. మన పక్కింటి తెలుగందంలా అనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. ఆమెకూడా తెలుగు భాషను అలానే మాట్లాడుతుంది. ఇక తనజీవితంలో కొన్ని విశేషాలను ఓ మీడియా సంస్థ ఇంటర్యూలో పంచుకుంది బ్యూటీ.. ఆమె ఏమంటుందంటే...? 

PREV
16
ఆ ఛాన్స్  మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను.. అనుపమా పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్..

ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ. భావోద్వేగాలు, ఈరెంటు ఉండాలి అంటోంది అనుపమా. ఈరెండు లేకుంటే..అది జీవితమే కాదు.. ఈరెండు కలిస్తేనే పరిపూర్ణ జీవితం అంటోంది బ్యూటీ. దీనికి సబంధించిన ఓ డైలాగ్ కూడా 18 పేజెస్ సినిమాలో ఉంది. అది తనకు ఎంతగానో నచ్చిదంటోంది అనుపమా. 
 

26

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా ఇరింజలకుడలో పుట్టారు అనుపమా పరమేశ్వరర్. తల్లీ తండ్రులు పరమేశ్వరన్‌, సునీత. అనుపమా ఇంటర్ వరకే చదివారు.. ఆతరువాత సినిమాల కోసం  చదువును మధ్యలోనే ఆపేశారట. అంతే కాదు మనిషిలో నిజాయితీ తనకు బాగా నచ్చుతుందట. ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే.. ఇంప్రెస్ అవుతానంటోంది. తాను ఏ విషయం అయినా.. ముక్కుసూటిగా చెప్పేస్తుందట. నచ్చకపోతే ముఖం మీదే అనేస్తుదంట అనుపమా. 
 

36

జీవితం చాలా చిన్నది..  ఉన్న ఈ కొద్ది సమయాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి.. అంతే కాని పనికిరాని విషయాలు బుర్రలో స్టోర్ చేసుకుని.. జీవితాన్ని నరకం చేసుకోకూడదు అంటోంది అనుపమా. నేను కూడా అంత ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. పనికిరాని చెత్తను నా మెదడులో స్టోర్‌ చేయను. ఎప్పటికప్పుడు డిలిట్‌ చేస్తా అంటోంది మలబారుభామ. 
 

46

ఇక అనుపమా తిండి విషయానికి వస్తే.. హీరోయిన్లు అందరు మాదిరిగా.. డైటింగ్స్ అంటే పడవంట.. తనకు ఇష్టమైన ఆహారం.. ఆరోగ్య కరమైన ఆహారం ఏది దొరికినా లాంగించేస్తుదంట బ్యూటీ.. ముఖ్యంగా తనమెనూలో  చికెన్‌ తో పాటు కాంబినేషన్ గా  గారెలు ఉంటే ఇక పండగే అంటోంది. రుచిగా,  వంటికి ఆరోగ్యంగా ఉంటే చాలు.. ఫుడ్‌ విషయంలో రూల్స్‌ పెట్టుకోను అంటోంది అనుపమా. 
 

56

ఇక  ప్రతీ మనిషి తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినప్పుడు అది జీవితాంతం బాధపడుతుంటాడు. తన జీవితంలో కూడా ఒక విషయంలో అప్పుడప్పుడు చాలా బాధపడుతుంటా అంటోంది అనుపమా. అదేంటంటే.. రంగస్థలం సినిమా నేనే చేయాల్సింది. అది  మిస్‌ అయినప్పుడు చాలా బాధపడ్డా. ఒకవేళ ఆ సినిమాలో నటించి ఉంటే.. అదే నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయ్యేదేమో.. అది గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది అంటోంది అనుపమా పరమేశ్వరన్. 
 

66

ఇక వరుస సినిమాలదో జోరు మీద ఉంది అనుపమా. నిఖిల్ తో ఎక్కువ సినిమాలు చేస్తుంది టాలీవుడ్ లో. ఇక తాజాగా సిద్దు జోన్నల గడ్డ జోడీగా.. డిజే టిల్లు 2లో నటిస్తోంది అనుపమా. మరికొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉండగా.. సౌత్ లో బిజీ బిజీ అయిపోయింది. అటు నార్త్ లో కూడా కార్తికేయా2 సినిమాతో మంచి పేరు సాధించింది బ్యూటీ. 
 

click me!

Recommended Stories