ఆ సీన్లలో తమన్నా రెచ్చిపోవడానికి అసలు కారణం ఇదా? ప్లాన్ ప్రకారమే చేసిందా!

First Published | Jul 9, 2023, 6:19 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా పేరు ఈ మధ్య నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారిన విషయం తెలిసిందే. అందుకు కారణంగా మునుపెన్నడూ లేనివిధంగా ఆమె వెబ్ సిరీస్ లో బోల్డ్ పెర్ఫామెన్స్ చేయడమే. అయితే దీని వెనకాల అసలు రీజన్ ఇదంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. 
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. 
 

అయితే కొద్దికాలంగా తమన్నాబాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు సౌత్ సినిమాల్లో అలరిస్తూనే హిందీలో సినిమాలు, సిరీస్ లు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు మతులు పోయేలా చేసింది. అందుకు కారణం మిల్క్ బ్యూటీ బెడ్ సీన్లలో నటించడమే. 


గతంలో ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా చేసింది. రెచ్చిపోయి పెర్ఫామెన్స్  చేసింది. గత నెలలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే రెండు సిరీస్ ల్లో తమన్నా చాలా ఘాటు పెర్ఫామెన్స్ తో అందరినీ షాక్ కు గురిచేసింది. 
 

అయితే, తమన్నా అలా నటించడానికి అసలు కారణం ఏంటనేది అందరి మదిలో మెదులుతున్న ఓ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికొంది. ప్లానింగ్ ప్రకారమే అలా చేసిందంటూ ఓ న్యూస్ అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చూస్తే.. తమన్నా సీనియర్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్తుండటం.. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు వినిపిస్తున్నాయి. 
 

18 ఏళ్లుగా తమన్నా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 33 ఏళ్లు. అటుపెళ్లికి నో చెప్పి.. ఇటు కెరీర్ ను ముందుకు నడిపిస్తోంది. మరోవైపు ఇండస్ట్రీలోకి యంగ్ హీరోయిన్లు వచ్చి దుమ్ములేపుతుండటం.. సీనియర్ బ్యూటీలకు సరిగా అవకాశాలు లేకపోవడం ఓకారణం. పైగా తమన్నాకు పెద్ద హిట్లు లేకపోవడంతోనే ఇలా చేసిందంటున్నారు. 

ఇక దీనిపై తమన్నానే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమను సహజంగా చూపించాలంటే అలాంటి సన్నివేశాలు ఉండటం కీలకమనిపించింది. ఎవరు విమర్శించినా, నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా అలా చూపిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది.
 

అలాగే శృంగార సన్నివేశాల్లో నటించేందుకు తమన్నాకు ఏకంగా రూ. 7 కోట్లు ఆఫర్ చేశారంట. ఇక లస్ట్ స్టోరీస్2లో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతోనూ రెచ్చిపోవడానికి కారణం వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉండటమేనని అంటున్నారు. ఏదేమైనా ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా తన పెర్ఫామెన్స్ తో అటు కెరీర్ ను, ఇటు పర్సనల్ లైఫ్ ను కూడా సెటిల్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

ఆ రెండు సిరీస్ లు విడుదలయ్యాకా తమన్నా పేరు మారుమోగుతోంది. మిల్క్ బ్యూటీ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఇప్పటితో ఆపుతుందా? ఇక మున్ముందు ఇలాగే కొనసాగిస్తుందా? అన్నది  చూడాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, తమిళ స్టార్ రజినీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తోంది. అటు హిందీలోనూ ఆయా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Latest Videos

click me!