టెంప్టింగ్ ఫోజులిచ్చిన అదితి రావు హైదరి, మ్యాగ్జైన్ కోసం సూపర్ హాట్ గా హైదరాబాద్ బ్యూటీ..

First Published Jan 4, 2023, 7:54 AM IST

అదితిరావు హైదరి.. పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంటలు పుట్టిస్తుంది బ్యూటీ. తగ్గేదే లేదంటుంది. 
 

కుర్రకారును సమ్మోహనపరిచే అందం అదితి రావు హైదరిది, నాజూకు సోకులతో సౌందర్య ప్రియుల మనసులను పిండేస్తుంది చిన్నది. హాట్ హాట ఫోజులతో అదరగొడుతుంది. 

రీసెంట్ గా అదితి రావు హైదరి బ్రైడ్స్ టుడే మ్యాగ్ జైన్ కోసం హాట్ హాట్ ఫోజులిచ్చింది. వేడివేడిగా ఆమె అందించిన అందాల విందుకు తట్టకోలేకపోతున్నారు కుర్రాళ్లు. ఈ ఫోటో షూట్లో అదితి  టెంప్టింగ్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. మత్తుగా చూస్తూ గమ్మత్తు చేసింది బ్యూటీ. 

చీరలో కూడా ఇంత సెక్సీగా కనిపించవచ్చా.. అది అదితీకే సాధ్యమా అన్నంతగా సమ్మోహనపరిచింది అదితిరావు. స్లీవ్ లెస్ జాకెట్ లో అలా.. కిందకు వంగి.. కాస్త ఎద అందాలు చూపించి చూపించకుండా.. చూపిస్తోంది బ్యూటీ. 

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదితి రావు హైదరి..  ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే  తన నటనతోమెస్మరైజ్ చేసింది. ఆతరువాత వరుసగా అంతరిక్షం, వి  వంటి సినిమాల్లో నటించింది కానీ అవి అంచనాలను అందుకోలేకపోయాయి. 

ఆ మధ్య మహాసముద్రం సినిమాలో చివరిసారిగా కనిపించింది అదితి రావు. కాని ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో పెద్దగా ఆర్లు మాత్రం ఆమె దరిచేరడంలేదు. కాని మహా సముద్రం సినిమా వల్ల అదితీరావు లో కొత్త విషయం బయటపడింది. 

మహాసముద్రం రిజల్ట్ ధారుణంగా పోయినా.. ఈ సినిమా మాత్రం అదితికి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ద్వారా హీరో సిద్దార్థ్ ఈమెకు బాగా దగ్గరయ్యాడు.ఇద్దరూ కలిసి ముంబై వీధుల్లో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. త్వరలో పెళ్ళి చేసుకున్నా  ఆశ్చర్యం అవసరం లేదు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 
 

వీరిద్దరి బంధంపై ఆమధ్య మహా సముద్రం సినిమాలో మరో హీరో శర్వానంద్ కూడా  పరోక్షంగా స్పందించి.. క్లారిటీ ఇచ్చాడు. వీరి రిలేషన్ పై వస్తున్న వార్తలు నిజమే అన్నట్టుగా మాట్లాడాడు  శర్వానంద్. సిద్ధార్థ్ – అదితి.. ఇద్దరికీ ఇది వరకు వేరే వ్యక్తులతో పెళ్లైంది. ఇద్దరూ కూడా తమ పార్టనర్స్ తో విడాకులు తీసుకుని సెపరేట్ అయ్యారు. 

ఇక సినిమాల్లో పెద్దగా అవకావాలు రాకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు..సిద్దార్థ్ తో ప్రేమ.. ఈ రెండు విషయాల వల్ల ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది అదితిరావ్ హైదరి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. 
 

click me!