హ్యాపీ డేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్ వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు లాంటి హిట్స్ తో వరుణ్ సందేశ్ పై యువతలో క్రేజ్ పెరిగింది. కానీ ఉన్నపళంగా వరుణ్ సందేశ్ కెరీర్ పడిపోతూ వచ్చింది. వరుణ్ సందేశ్ కెరీర్ గట్టెక్కేలా ఒక్క హిట్ కూడా దక్కలేదు.