నాగచైతన్య, సాయిపల్లవిలను ఇమిటేట్‌ చేసిన `కార్తీకదీపం` జంట.. వంటలక్క, డాక్టర్‌బాబు వాడకం నెక్ట్స్ లెవల్‌

Published : Mar 24, 2024, 02:07 PM IST

తెలుగు బుల్లితెరపై పాపులర్‌ అయిన టీవీ సీరియల్‌ `కార్తీకదీపం`. దీనికి ఇప్పుడు సీక్వెల్‌ వస్తుంది. ఇందులోని ప్రధాన జంట చైతూ, సాయిపల్లవిలను ఇమిటేట్‌ చేయడం విశేషం.   

PREV
16
నాగచైతన్య, సాయిపల్లవిలను ఇమిటేట్‌ చేసిన `కార్తీకదీపం` జంట.. వంటలక్క, డాక్టర్‌బాబు వాడకం నెక్ట్స్ లెవల్‌
Karthika deepam 2

 `కార్తీక దీపం`.. తెలుగు సీరియల్స్ అన్నింటిలో సంచలనం. దీనికి దక్కిన ఆదరణ ఇటీవల కాలంలో మరే దానికి దక్కలేదని చెబితే అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌, వరల్డ్ కప్‌ల కంటే ఈ సీరియల్‌కే డిమాండ్‌ ఎక్కువగా ఉండటం విశేషం. దాదాపు ఐదేళ్లపాటు ఇది నిర్వరామంగా సాగింది. గతేడాది పూర్తయ్యింది. అయితే దీనికి విశేష అభిమానులు ఏర్పడ్డారు. `కార్తీకదీపం` లేని లోటుని ఫీలవుతున్నారు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

టీవీ ఆడియెన్స్ డిమాండ్‌ మేరకు ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్‌ని తీసుకొస్తున్నారు. `కార్తీకదీపం2` పేరుతో ఈ సీరియల్‌ సెకండ్‌ సీజన్‌ని ప్రారంభిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అనౌన్స్ చేశారు. ఏకంగా ఈవెంట్‌ నిర్వహించారు. ఇక ఈ సీరియల్‌ ప్రమోషన్స్ జోరు పెంచారు. సాధారణంగా ప్రమోషన్స్ సీరియల్‌లోని సీన్లని చూపిస్తారు. ఆడియెన్స్ క్యూరియాసిటీని పెంచుతారు. కానీ వీళ్లు మాత్రం ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్నారు. 
 

36

`కార్తీకదీపం`లో రెండు ప్రధానంగా పాపులర్‌ అయ్యాయి. అదే కార్తీక్‌ అలియాస్‌ డాక్టర్‌ బాబు, దీప అలియాస్‌ వంటలక్క పాత్రలు బాగా పేలాయి. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణనే ప్రధానంగా సాగుతుంది. దీనికి మోనిత పాత్ర యాడ్‌ అవుతుంది. ఆమెది నెగటివ్‌ రోల్‌. ఈ పాత్రల్లో నిరుపమ్‌, ప్రేమీ విశ్వనాథ్‌, శోభా శెట్టి నటించారు. తమ పాత్రలకు ప్రాణం పోసిన విషయం తెలిసిందే. 
 

46

ఇక సీరియల్‌ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాల రీల్స్ లో యాక్ట్ చేసి మరింత క్రేజ్‌ని తీసుకొస్తున్నారు. అందుకు నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న `తండేల్‌` మూవీ గ్లింప్స్ ని వాడుకోవడం విశేషం. వాలెంటైన్స్ డే సందర్భంగా `తండేల్‌` టీమ్‌ నాగచైతన్య, సాయిపల్లవి మధ్య ప్రేమని తెలియజేసేలా ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్‌ చేశారు. 
 

56

ఇందులో నాగచైతన్య బుజ్జితల్లే.. వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే` అని ప్రేమగా పిలుస్తాడు చైతూ.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది. మొదట్లో బాధలో నుంచి ఆమె నవ్విన తీరు ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ వీడియో వైరల్‌ అయ్యింది. ఇది రీల్‌గా ట్రెండింగ్‌లో ఉంది. 
 

66

దీన్ని నిరుపమ్‌, ప్రేమి విశ్వనాథ్‌ రీల్స్ చేశారు. చైతూ, సాయిపల్లవిలా యాక్ట్ చేశారు. వారిని దించేశారు. ప్రస్తుతం ఈ రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక రేపటి నుంచి(మార్చి 25) `కార్తీకదీపం2` ప్రారంభమవుతుంది. స్టార్‌ మాలో ఇది టెలీకాస్ట్ అవుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ని ప్రసారం చేయబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories