తలపై కిరీటం, బ్లాక్ లెథర్ అవుట్ ఫిట్... రోమన్ గాడెస్ లా శృతి హాసన్... కిక్కిస్తున్న అమ్మడు కొత్త అవతారం

Published : Oct 29, 2021, 11:09 AM ISTUpdated : Oct 29, 2021, 11:11 AM IST

శృతి హాసన్ క్రాక్, వకీల్ సాబ్ వంటి వరుస హిట్స్ దక్కించుకున్నా, ఆఫర్స్ మాత్రం శూన్యం. అటు తమిళ్, ఇటు తెలుగులో ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. తిరిగి ఫార్మ్ లోకి వచ్చింది, వరుస ఆఫర్స్ దక్కుతాయనుకుంటే, ఆ సూచనలు కనిపించడం లేదు.   

PREV
17
తలపై కిరీటం, బ్లాక్ లెథర్ అవుట్ ఫిట్... రోమన్ గాడెస్ లా శృతి హాసన్... కిక్కిస్తున్న అమ్మడు కొత్త అవతారం


అయితే సలార్ వంటి భారీ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉండడం విశేషం. పాన్ ఇండియా స్టార్ Prabhas, పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సలార్ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, శృతి హాసన్ పాల్గొంటున్నారు. దీంతో శ్రుతి ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే పెట్టుకుంది.

27

 Salaar కనుక బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే శృతి హాసన్ ఫేట్ మారే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా శృతి స్టార్ హీరోయిన్ హోదా పోగొట్టుకోవడంతో పాటు, ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నారు. టాలీవడ్ స్టార్స్ ఎవరూ, ఆమెను ప్రిఫర్ చేసే సూచనలు కనిపించడం లేదు. రాబోయే అప్ కమింగ్ చిత్రాలలో ఆమె పేరు వినిపించడం లేదు. 

37

అంత మాత్రాన Shruti haasan దిగులు పడుతున్నారు, కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు అనుకుంటే పొరపాటే. శృతి ప్రస్తుతం తన కొత్త ప్రియుడు శాంతను హజారిక ప్రేమలో మునిగి తేలుతున్నారు. అతనితో పాటు ముంబైలో మకాం పెట్టిన శృతి, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు.

47


ఇటీవల జరిగిన చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకలో సైతం శాంతను పాల్గొన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ హాజరైన ఈ పార్టీలో shantanu hajarika ను శృతి హాసన్ అందరికీ పరిచయం చేశారు. విషయం ఇంత వరకు రావడంతో పెళ్లే తరువాయి అన్న మాట వినిపిస్తుంది. 

57

గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో శృతి రెండేళ్లకు పైగా డేటింగ్ చేశారు. అనంతరం 2019లో విడిపోయారు. మైఖేల్ చెన్నైలోని కమల్ నివాసానికి పలుమార్లు రావడం విశేషం. మరి శాంతను రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. 

67


మల్టీ టాలెంటెడ్ అయిన శృతి హీరోయిన్ గా అవకాశాలు లేకున్నా, సింగర్ గా రాణించగలదు. లాక్ డౌన్ కి ముందు లండన్ లో శృతి వరుసగా మ్యూజిక్ లైవ్ షోలు ఇవ్వడం జరిగింది. మైఖేల్ తో బ్రేకప్ పెయిన్ నుండి ఆమె ఆ విధంగా బయటపడ్డారు. శృతి కెరీర్ పాడైంది కూడా మైకేల్ ప్రేమ వలెనే కావడం విశేషం. 

77


మరో వైపు శృతి సోషల్ మీడియా వేదికగా క్రేజీ ఫోటో షూట్స్ పంచుకుంటారు. తాజాగా ముళ్ల కిరీటం, లెథర్ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి, కెమెరా ముందు క్రేజీ ఫోజులిచ్చారు. శృతి లేటెస్ట్ లుక్ లో రోమన్ గాడెస్ లా ఉంది. ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. 

Also read జాన్వీ కపూర్‌ ఇంతగా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమంటోన్న కుర్రాళ్లు.. అందాల సమ్మోహనం ఇలానే ఉంటుందేమో!

Also read అమలాపాల్‌ నెక్ట్స్ లెవల్‌ హాట్‌ షో.. పింక్‌ జాకెట్‌లో ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నహాట్‌ పోజులు..

Read more Photos on
click me!

Recommended Stories