ముక్కుకు ముక్కెర, కైపెక్కించే నడుమురా... పాల రోజా చోళీ లెహంగాలో సమంత సరికొత్త లుక్, లేటెస్ట్ ఫోటోలు వైరల్

First Published Sep 4, 2021, 8:48 AM IST

వివాదాల సంగతి ఎలా ఉన్నా సమంత హ్యాపీగా తన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలకు షార్ట్ బ్రేక్ ప్రకటించిన ఫ్రెండ్స్ తో కలిసి విహారాలలో పాల్గొంటున్నారు.

స్టార్ హీరోయిన్ గా తీరిక షెడ్యూల్స్ , పని ఒత్తిడి నుండి పారిపోయి దూరంగా ప్రశాంత విరామం అనుభవిస్తున్నారు. షూటింగ్స్,  మీటింగ్స్ పక్కన పెట్టి ఫ్రీ బర్డ్ మాదిరి వివాహరిస్తున్నారు. సమంత తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ వెకేషన్ లో చిన్న చిన్న సాహసాలు కూడా సమంత ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె లైఫ్ జాకెట్ ధరించి బోటింగ్ చేస్తున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సమంత తెగువకు, ధైర్యానికి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. 


అలాగే సమంత క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరించడం కొసమెరుపు. ట్రెండీ డిజైనర్ వేర్స్ ధరిస్తూ సమంత సూపర్ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు. 

తాజాగా సమంత పాల రోజా కలర్ చోళీ, లెహంగా ధరించి సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు. జుట్టు ముడివేసి, ముక్కుకు ముక్కెర ధరించి ఒకింత ట్రైబల్ లుక్ లో సమంత ఆకట్టుకున్నారు. నాజూకు సమంత అందాలు కొత్త కోణంలో ఆవిష్కృతం అయ్యాయి. 

మరోవైపు ఎప్పటికప్పుడు సమంత వెకేషన్ ఫోటోలు పంచుకుంటూ.. ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్లు అభిమానులకు తెలియజేస్తున్నారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం కోసమే సమంత ఈ టూర్ ప్లాన్ చేశారనే మరో వాదన కూడా తెరపైకి వస్తుంది. 
 

సమంత, నాగ చైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ విబేధాలు విడాకుల వరకు వెళ్లాయని కొన్నాళ్ళుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ మీడియా సైతం ఈ విషయంపై సమంతను సంప్రదించగా, ఆమె క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. 
 

click me!