పెళ్ళైన సమంతకు మనసైన హీరో ఎవరో తెలుసా... ఆయనతో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదట!

First Published May 23, 2021, 8:08 AM IST

సమంత బాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. కాకపోతే సినిమాతో కాకుండా ఆమె వెబ్ సిరీస్ తో అక్కడ అడుగు పెట్టారు. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో సమంత కీలక రోల్ చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతుంది. ముఖ్యంగా సమంత లుక్, క్యారెక్టర్ ఆసక్తి రేపుతోంది. 

త్వరలో అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మాన్ 2 స్ట్రీమ్ కానుంది. దీనితో టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచారు. దీనిలో భాగంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడడంతో పాటు, ఇంటర్వ్యూలలో విరివిగా పాల్గొంటున్నారు సమంత. ఈ క్రమంలో బాలీవుడ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
undefined
బాలీవుడ్ ఎంట్రీకి ఇంత ఆలస్యం కావడానికి కారణం అడుగగా... ఇక్కడ నటులు చాలా టాలెంటెడ్. అందుకే మనం ఇక్కడి వాళ్ళతో పోటీ పడగలమా అనే భయం ఉండేది. అందుకే బాలీవుడ్ లో సినిమా చేయడానికి లేట్ అయ్యింది. ఫ్యామిలీ మాన్ 2లో నా నటనతో ఆకట్టుకుంటానని ఆశిస్తున్నాను అన్నారు.
undefined
ఇక బాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరనగా... చాక్లెట్ బాయ్ రన్బీర్ కపూర్ పేరు చెప్పింది సమంత. రన్బీర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, అతనికి జోడిగా నటించాలని ఉందని సమంత మనసులోని కోరిక బయటపెట్టారు. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని సమంత తెలియజేశారు.
undefined
కాగా ఫ్యామిలీ మాన్  సిరీస్ లో హీరోగా నటించిన మనోజ్ బాజ్పాయ్ రోల్ టాలీవుడ్ లో ఏ హీరోకి సరిపోతుందని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమంత... మామగారైన నాగార్జున పేరు చెప్పారు. ఫ్యామిలీ మాన్ సిరీస్ హీరోగా నాగార్జున సెట్ అవుతారని మామపై అభిమానం చాటుకుంది.
undefined
మరో వైపు ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ తమిళుల మనోభావాలు దెబ్బతీసింది. ముఖ్యంగా సమంతపై వారు తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు కూడా డిమాండ్ చేశారు. అందరూ శాంతంగా ఉండాలని విమర్శలపై పరోక్షంగా స్పందించారు సమంత.
undefined
ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో సమంత నటిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించడం జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ మూవీ షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
undefined
click me!