లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్లు... హీరోయిన్ సదా ఆలస్యంగా మేలుకున్నప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సూపర్ హాట్ గ్లామర్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. సదా గ్లామర్ షో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పాలి.
తాజాగా టైట్ జీన్స్, టీ షర్ట్ ధరించి చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. సదా(Sadaa) లుక్ కేక పుట్టించగా కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు.
27
Sadaa
ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది సదా. ఎన్టీఆర్ (NTR) వంటి స్టార్ హీరోతో నాగ చిత్రంలో జతకట్టిన సదా, విక్రమ్ తో అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. అయితే ఆమె కెరీర్ చాలా త్వరగా ఫాల్ అయ్యింది.
37
Sadaa
2002లో విడుదలైన జయం ఓ సంచలనం. నితిన్, సదా లను వెండితెరకు పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. వెళ్ళవయ్యా వెళ్లూ... అంటూ సదా చెప్పిన డైలాగ్ అప్పట్లో ఫుల్ ఫేమస్.
47
Sadaa
జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సదా.. సౌత్ లో బిజీ హీరోయిన్ అయ్యారు. తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, విక్రమ్ వంటి స్టార్స్ సరసన సదా నటించడం జరిగింది.
57
Sadaa
ఆరంభంలో స్టార్ గా మెరుపులు మెరిపించిన సదా కెరీర్ చాలా త్వరగానే డౌన్ అయ్యింది. వరుస పరాజయాల కారణంగా స్టార్స్ నుండి చిన్న హీరోల రేంజ్ కి పడిపోయారు.విక్రమ్ కి జంటగా ఆమె చేసిన అపరిచితుడు ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ అన్నియన్ పేరుతో తమిళంలో తెరకెక్కించిన ఆ చిత్రం తెలుగులో అపరిచితుడు టైటిల్ తో విడుదలైంది.
67
Sadaa
అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ ఆమెకు తగల్లేదు. బాలయ్య వంటి స్టార్స్ తో అవకాశం వచ్చినా... హిట్ కాకపోవడంతో బ్రేక్ రాలేదు. మెల్లగా టూ టైర్ హీరోలకు పడిపోయిన సదా, అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నారు.
77
Sadaa
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ లో జడ్జిగా కూడా కనిపిస్తున్నారు. అలాగే వెండితెరపై వయసుకు తగ్గ పాత్రలు చేయాలని ఆశపడుతున్నారు. మరి చూడాలి సదా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో..