హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. ట్రెండీ వేర్ లో గ్లామర్ షో చేయడం ఆమెకు పరిపాటిగా మారింది. లేటెస్ట్ గా ఆమె బ్యాక్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు.
విశాలమైన వీపు చూపిస్తూ కళ్ళతో కవ్వించారు. ప్రగ్యా అందాల దాడికి సోషల్ మీడియా జనాలు బేజారవుతున్నారు. మనసులు దోచేస్తున్న అందాలను చూస్తూ ఉండలేక క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Pragya Jaiswal Glamorous Photos) వైరల్ ఆ మారాయి.
27
Pragya Jaiswal
అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ప్రగ్యా జైస్వాల్. అనుకోకుండా వచ్చిన ఆఫర్ ఆమెకు మంచి విజయాన్ని చేకూర్చింది. వరల్డ్ వైడ్ గా అఖండ (Akhanda) రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
37
Pragya Jaiswal
కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటున్న తరుణంలో అఖండ హిట్ ఆమె ఆశలు సజీవంగా ఉంచింది. అయితే ఆమెకు కొత్త ఆఫర్స్ ఏమీ రాలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటికి దక్కింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా దర్శకులు ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు.
47
Pragya Jaiswal
కాగా ప్రగ్యా(Pragya Jaiswal)కు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.
57
Pragya Jaiswal
ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
67
దీంతో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణుతో ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా... అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని... షాక్ ఇచ్చింది.
77
Pragya Jaiswal
అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో అందాలు విందు చేస్తుంది.