అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న యష్, కోట్లు వదులుకున్న కెజియఫ్ స్టార్

Published : May 02, 2022, 09:36 AM IST

అల్లు అర్జున్ బాటలోనే నడుస్తున్నాడు కన్నడ కెజియఫ్ స్టార్ హీరో యష్. కోట్లకు కోట్లు వచ్చిముందు పడుతుంటే.. సున్నితంగా తిరస్కరించాడు. తమ అభిమానులే తమకు ముఖ్యం అన్నాడు. ఇంతకీ  బన్నీలా యష్ కూడా తీసుకున్న ఆ మంచి నిర్ణయం ఏంటీ. 

PREV
18
అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న యష్, కోట్లు వదులుకున్న కెజియఫ్ స్టార్

ఇదివరకట్లా కాదు..ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ సినిమాలు మాత్రమే చేసి ఊరుకోవడం లేదు. సైడ్ ఇన్ కమ్ గా బిజినెస్ లు చేస్తున్నారు. ఏదో ఒక ప్రాడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. సినిమాల కంటే వాటి ద్వారానే ఎక్కువగా సంపాధిస్తున్నారు. అందులో మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు.  గతంలో ఇవి పెద్దగా పట్టించుకోని అల్లు అర్జున్ కూడా.. ఈ మధ్య ఎక్కువగ కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. 
 

28

సినిమా హీరోల‌కున్న‌ క్రేజ్‌ను కమర్షియల్ గా వాడుకోవాలి అని చూస్తుంటాయి వాణిజ్య సంస్థ‌లు. ఏదో ర‌కంగా  తమ ప్రాడెక్ట్ ను ప్రమోట్ చేసుకోవాలి అనే ఆలోచనలో.. స్టార్ హీరోల ఇమేజ్ ను కోట్లకు కోట్లు పెట్టి   త‌మ బ్రాండ్ల‌ను హీరోల‌తో ప్ర‌మోట్ చేయించుకునేందుకు భారీ ప్ర‌క‌ట‌న‌లు రూపొందిస్తుంటాయి. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. అది ఇప్పుడు సౌత్ లో ఇంకా బాగా పెరిగిపోయింది. 

38

హీరోలు, హీరోయిన్లతో కోట్లు పెట్టి మ‌రీ యాడ్ ఫిల్మ్స్  చేయిస్తుంటాయి. స్టార్ హీరోలు కూడా కోట్లు వచ్చిపడుతుండటంతో బ్రాండ్ ప్రమోటర్లుగా మారిపోతున్నారు. అయితు కొంత మంది హీరోలు మాత్రం కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పక్కాగా మేము చేయం అని చెప్పేస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఇదే మాట చెప్పాడు.  అటు అక్షయ్ కుమార్ ఫస్ట్ చేయాలని చూసినా.. వ్యతిరేకత రావడంతో.. వెనక్కి తగ్గాడు. 

48

ఈ మధ్య అల్లు అర్జున్ ఫుడ్ డెలివరీ, తో పాటు మరికొన్ని కంపెనీలకు బ్రాండ్ గా ఉన్నారు. ఆ విషయంలో కొన్ని విమర్షలు కూడా ఫేస్ చేశాడు బన్నీ. ఇక తన దగ్రకు వచ్చికొన్ని ప్రాడెక్ట్స్ ను ప్రమోట్ చేయను అని చెప్పేశాడు బన్నీ ముఖ్యంగా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడే పాన్ మసాలా బ్రాండ్స్ , తోబ్యాకో బ్రాడ్స్ విషయంలో.. అందరూ ఎలా ఉన్నా.. వాటిని నేను ప్రమోట్ చేయను అని ఖరాకండీగా చెప్పేశాడు అల్లు అర్జున్.  
 

58

పొగాకు ఉత్ప‌త్తుల సంస్థ యాడ్ కోసం అల్లు అర్జున్ ముందుకు భారీ మొత్తంలో డీల్‌తో వ‌చ్చినా..బ‌న్నీ మాత్రం ఆ యాడ్ చేసేందుకు నో చెప్పి..చాలా మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఇపుడు మ‌రో పాన్ ఇండియా స్టార్ య‌శ్ కూడా పెద్ద డీల్ ఒక‌టి ర‌ద్దు చేసుకున్నాడ‌ట‌. భారీగా డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ య‌ష్ ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 

68

యష్ ఇప్పటికే తన భార్య రాధిక పండిట్ తో కలిసి  కొన్ని యాడ్స్ చేస్తున్నాడు.  అయితే కెజియఫ్2 తో  యష్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన  ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక దాంతో కోట్ల ఆఫర్లతో యష్ ఇంటి చుట్టూ చేరుతున్నాయి కంపెనీలు. అలానే ఓ పాన్ మసాలా యాడ్ కోసం  యష్ ను సంప్రదించగా.. యష్ సున్నితంగా తీరస్కరించాడట. 
 

78

ఇలా స‌మాజాన్ని ప‌ట్టి పీడించే పొగాకును దూరంగా పెట్టాల‌నే నిర్ణ‌యం తీసుకోవడం ప‌ట్ల కెజియఫ్ స్టార్  ఫాలోవ‌ర్లు, అభిమానులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇండస్ట్రీ నుంచి  కూడా యష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

88

టొబాకో కంపెనీ భారీ ఆఫ‌ర్‌తో య‌శ్ ద‌గ్గ‌ర‌కు రాగా..య‌శ్ కూడా నో చెప్పాడ‌న్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ పాన్ మ‌సాలా బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌గా.. భారీగా ట్రోలింగ్ కు గురయ్యాడు . దాంతో  తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు అక్షయ్ కుమార్ . 
 

Read more Photos on
click me!

Recommended Stories