Pooja Hegde:పెళ్లి ఎంత కష్టమో అంటున్న పూజా హెగ్డే... భామకు అంత భయం ఎందుకంటే?

Published : Dec 05, 2021, 02:55 PM IST

స్టార్ లేడీ పూజా హెగ్డే (Pooja hegde) పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిని ఓ పెద్ద తంతుగా అభివర్ణించారు. పెళ్లి చేసుకోవడం అంత సులభమైన విషయం కాదన్న అభిప్రాయం వెల్లడించారు.

PREV
16
Pooja Hegde:పెళ్లి ఎంత కష్టమో అంటున్న పూజా హెగ్డే... భామకు అంత భయం ఎందుకంటే?

 
పూజా హెగ్డే ప్రస్తుతం చేతి నిండా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. బడా స్టార్స్ సినిమాలలో నటిస్తున్న ఆమె కోట్లలో సంపాదిస్తున్నారు. సినిమాకు మూడు కోట్లకు పైగా తీసుకుంటున్న పూజా సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ చేస్తుంది. 

26

ఇటీవల ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ఇంటీరియర్స్ తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకుంది. తన కలలు సౌధాన్ని దగ్గరుండి నిర్మించుకుంది పూజ. అయితే ఇల్లు కట్టుకోవడానికి పూజ చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారట. ఆ విషయం ఆమె తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. 

36

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూజ హెగ్డేను పెళ్లి గురించి అడిగితే ఇలా స్పందించారు. పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. నిజంగా ఇల్లు కట్టడం వెనుక చాలా శ్రమ దాగి ఉంటుంది. సొంత ఇంటిని నిర్మించుకోవడం అంత సులువైన విషయం కాదు.
 

46

 
ఇక ఇల్లు కట్టుకోవడమే ఇంత కష్టమైతే పెళ్లి చేసుకోవడం ఇంకా ఎంత కష్టమో అని పూజా తన అభిప్రాయం తెలియజేశారు. ఇక కలకాలం కలిసి ఉండాలి అనిపించే వ్యక్తిని భర్తగా తెచ్చుకుంటానని పూజా తెలియజేశారు. 
 

56

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో మంచి హిట్ కొట్టిన పూజా హెగ్డే... రాధే శ్యామ్ మూవీతో సంక్రాంతి బరిలో దిగనుంది. ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ (Radhe Shayam) పై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఇక చరణ్ తో ఆచార్య మూవీలో జతకట్టారు. ఆచార్య సమ్మర్ కానుకగా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 


 

66

అలాగే కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ కి జంటగా బీస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక సల్మాన్ కి జంటగా భాయ్ జాన్ మూవీలో పూజా నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ చిత్రాలలో హీరోయిన్ గా పూజా పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Also read Payal Rajput: పాయల్ ఒంటిని గట్టిగా హత్తుకొని ముద్దాడుతున్న టైట్ డ్రెస్..హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టిన బ్యూటీ

Also read గ్రీన్‌ డ్రెస్‌లో థై షోతో పిచ్చెక్కిస్తున్న విజయ్‌ భామ.. మాళవిక మోహనన్‌ వీకెండ్‌ ట్రీట్‌కి ఫ్యాన్స్ పండగ

Read more Photos on
click me!

Recommended Stories