పర్ఫెక్ట్ పార్టనర్ తో బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి... జీవితానికి ఇంకేం కావాలంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

First Published Jun 19, 2021, 11:47 AM IST

ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే కీర్తి సురేష్ చాలా సన్నబడ్డారు. ఒకప్పటి ఆమె బరువుతో పోల్చుకుంటే ఇప్పుడు సరిగ్గా సగం ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా సన్నజాజి తీగలా మారిపోయింది కీర్తి. 
 

గ్లామర్ ఫీల్డ్ లో ఎంత సన్నగా ఉంటే అంత మంచిది. సన్నగా నాజూగ్గా ఉండడం కోసం హీరోయిన్స్ కఠిన కసరత్తులు, యోగాసనాలు చేస్తారు. ఇష్టమైన ఫుడ్ కూడా వదులుకొని మితంగా తింటూ కడుపు మాడ్చుకుంటారు. పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే తప్పదు మరి.
undefined
సన్నబడిన కీర్తి గ్లామర్ పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అప్పుడే బాగుంది అంటే మరికొందరు ఇప్పుడే బాగుంది అంటున్నారు. ఏది ఏమైనా కీర్తి మాత్రం సన్నబడిన శరీరంలో సరికొత్తగా కనిపిస్తున్నారు.
undefined
కాగా కీర్తి సురేష్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె తన పార్ట్నర్ తో పాటు బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పంచుకున్నారు.
undefined
ఐతే పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ అనుకునేరు... ఆమె వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది లైఫ్ పార్ట్నర్ తో కాదు, పెట్ పార్ట్నర్ తో. పెట్ డాగ్ తో పాటు బీచ్ వెకేషన్ కి వెళ్లిన కీర్తి ఎంతో ఎంజాయ్ చేసినట్లు, జీవితానికి ఇంకేం కావాలని కామెంట్ పెట్టారు.
undefined
అందమైన తన పెట్ డాగ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కీర్తి సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ నచ్చిన కామెంట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.
undefined
ఇక కెరీర్ విషయానికి వస్తే సౌత్ ఇండియాలోని టాప్ స్టార్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీలో కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
undefined
అలాగే రాజీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ మరక్కార్ లో కూడా కీర్తి హీరోయిన్ చేస్తున్నారు.
undefined
చేతినిండా ఆఫర్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి దూసుకుపోతున్నారు. సౌత్ లో అన్ని బాషలలో సినిమాలు చేస్తూ తన స్టార్డం నిరూపించుకుంటున్నారు.
undefined
click me!