బర్త్ డే స్పెషల్: కాజల్ నటించిన టాప్ టెన్ మూవీస్... ఫ్యాన్స్ అస్సలు మిస్ కాకూడని సినిమాలు!

First Published Jun 19, 2021, 9:27 AM IST

చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. 1985 జూన్ 19న జన్మించిన కాజల్ తన 36వ బర్త్ డే జరుపుకుంటున్నారు. కాజల్ బర్త్ డే నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాజల్ వెండితెరకు పరిచయమై 15ఏళ్ళు దాటిపోయింది. స్టార్ హీరోయిన్ గా ఆమె ప్రస్థానం టాలీవుడ్ లోనే ఎక్కువగా సాగింది. టాప్ స్టార్స్ అందరిని  కవర్ చేసిన కాజల్ అగర్వాల్ కెరీర్ లో టాప్ 10 చిత్రాలు ఏమిటో చూద్దాం.. 

దర్శకుడు తేజ లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. 2007లో విడుదలైన చందమామ కాజల్ కి ఫస్ట్ హిట్ ఇచ్చింది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఆ మూవీలో నాగబాబు కూతురుగా కాజల్ నటన ఆకట్టుకుంది.
undefined
చందమామ తరువాత వరుస ప్లాప్స్ అందుకున్న కాజల్ కి దర్శకుడు రాజమౌళి భారీ ఆఫర్ ఇచ్చారు. మగధీర మూవీ కోసం ఆమెను ఎంపిక చేశారు. ప్లాప్స్ లో ఉన్న కాజల్ ని దేవసేన పాత్రకు చిరంజీవి వద్దన్నారట. అయితే కాజల్ తో లుక్ టెస్ట్ చేయించి చిరును ఒప్పించారట రాజమౌళి. చరణ్ రెండవ మూవీగా 2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టి కాజల్ కెరీర్ కి గట్టిపునాది వేసింది.
undefined
సుకుమార్ దర్శకత్వంలో ఆర్య చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది ఆర్య 2. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జంటగా కాజల్ నటించగా ఆర్య సైకో ప్రేమకు భయపడుతూ ఉండే సాఫ్ట్ వేర్ అమ్మాయిగా చక్కగా నటించారు కాజల్.
undefined
కాజల్ ఇమేజ్ ని పెంచి కుర్రకారుకు దగ్గర చేసిన చిత్రాలలో డార్లింగ్ ఒకటి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన డార్లింగ్ మూవీలో కాజల్ అల్లరి, ప్రభాస్ తో రొమాన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. 2010లో విడుదలైన డార్లింగ్ కాజల్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.
undefined
ఎన్టీఆర్-కాజల్ మొదటిసారి జతకట్టిన చిత్రం బృందావనం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ తండ్రి చాటు పిల్లగా, ఎన్టీఆర్ పై లేని ప్రేమను ఉన్నట్లు, ఉన్న ప్రేమను లేనట్లు నటించే అమ్మాయిగా నటించి మెప్పించారు.
undefined
2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ పై అసహ్యం, ప్రేమ రెండు షేడ్స్ చక్కగా చేశారు కాజల్.
undefined
మహేష్ బాబు కాజల్ కాంబినేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బిజినెస్ మాన్ సూపర్ హిట్ గా నిలిచింది. 2012లో విడుదలైన ఈ మూవీలో కాజల్ గ్లామర్ అద్భుతం అని చెప్పాలి.
undefined
ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మూవీ బాద్ షా. కాజల్ రెండోసారి ఎన్టీఆర్ తో జతకట్టిన ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కాజల్ కామెడీ, రొమాన్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయి.
undefined
2015లో వచ్చిన టెంపర్ మూవీలో కాజల్ యానిమల్ లవర్ గా కనిపించారు. అమాయకత్వం, అందం, మంచి మనసున్న అమ్మాయిగా కాజల్ నటన అద్భుతం అని చెప్పాలి. ఎన్టీఆర్ తో కాజల్ హ్యాట్రిక్ మూవీ ఇది.
undefined
కాజల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం 'అ'. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో కాజల్ నటన ఆకట్టుకుంది. ఈ మూవీ అనేక జాతీయ అవార్డ్స్ గెలుపొందింది.
undefined
click me!