డబ్బు కోసం హద్దులు దాటి నటించను, మొదటి ప్రాధాన్యత దానికే అంటున్న కీర్తి సురేష్

Published : Apr 23, 2022, 10:20 AM IST

తన కెరీర్ గురించి క్లారిటీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. సినిమాల కోసం ఏది చేయమంటే అది చేయడానికి తాను సిద్ధంగా లేనంటోంది. తన హద్దుల్లో తాను ఉంటూ.. మంచి పాత్రలు చేసుకుంటానంటోంది. డబ్బుకు ఆశపడి హద్దులు దాటనంటోంది.   

PREV
16
డబ్బు కోసం హద్దులు దాటి నటించను, మొదటి ప్రాధాన్యత దానికే అంటున్న కీర్తి సురేష్

హీరోయిన్ అంటే చాలు గ్లామర్ పీస్ లాగా చూస్తుంటారు. అందాల ఆరబోతకు, హీరోతో రొమాన్స్ చేయడానికి, ఆడియన్స్ కామెంట్ చేయడానికిమాత్రమే వారు ఉన్నది అని అనుకునే మహానుభావులు కూడా లేకపోలేదు ఈ సమాజాంలో కాని కొంత మంది హీరోయిన్లు మాత్రం మేం మాలాగే ఉంటాం.. అంటున్నారు. డబ్బుకోసం హద్దులు దాటమంటే.. మాతోని కాదు అంటున్నారు. అటువంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. 

26

అవకాశాలు వచ్చినా.. రాకపోయినా.. కమర్షియల్ సినిమాలు మాత్రమే ఇంపార్టెంట్ కాదంటోంది కీర్తి. తనను మంచి నటిగా గుర్తించే సినిమా ఏదైనా సరే సై అంటుంది. ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నది స్టార్ హీరోయిన్  కీర్తి సురేష్‌. గ్లామర్‌ పాత్రలు మాత్రమే తన మొదటి ప్రాధాన్యం కానేకాదంటొంది. 

36

డబ్బులు కోసం కమర్షియలు చేస్తూ.. వాళ్లు చెప్పినట్టు ఆ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వల్ల కాదంటున్నది.నటిగా గుర్తింపుతో పాటు మంచి సినిమాలో నటించామన్న సంతోషం,సక్సెస్ ను ఆశిస్తున్నట్లు తెలిపింది.  ఈమధ్య కాలంలో హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే చూస్తున్నారు, హీరోయిన్ లో టాలెంట్, పెర్ఫామెన్స్ ను గుర్తించి, మంచి పాత్రలు ఇవ్వడంలేదు. దాంతో హీరోయిన్ అంటే సినిమాకు అలంకార ప్రాయంగా మారింది. 
 

46

అందుకే కీర్తు సురేష్ నటిగా తన  అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని కోరుకుంటాను. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న హీరోయిన్  పాత్రలే తనకు దక్కుతున్నాయి అంటోంది  కీర్తి సురేష్. ఇప్పటి వరకూ అలాంటి పాత్రలు రావడం వల్లే తాను హీరోయిన్ గా ప్రేక్షకులు ఆదరణ పొందుతున్నా    అంటోంది కీర్తిసురేష్. ఇక తాను  కమర్షియల్‌ సినిమాలతో పాటు మంచి కథతో  కూడిన సినిమాలు కూడా చేయాలనుకుంటున్నట్టు చెపుతోంది. 
 

56

ఇలా కెరీర్ ను  బ్యాలెన్స్‌ చేసుకుంటూ...నటిగా అందరికి గుర్తుండిపోవాలని తన తాపత్రేయం అంటోంది కీర్తి సురేష్. అంతే కాదు తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. అవి దాటి నటించను అని అంటోంది. కీర్తి సురేష్‌.

66

ఇక ప్రస్తుతం  కీర్తి సురేష్  సూపర్ స్టార్ మహేష్‌ బాబు జోడీగా సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్‌, నానికి జోడీగా దసరా సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని మంచి సినిమాలు ఆమె ఖాతాల్లో ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories