జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ పడిందంటే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావలసిందే. తాజాగా సుధీర్, రాంప్రసాద్, ఇమ్మాన్యూల్ ఇతర కమెడియన్లు కలసి చేసిన స్కిట్ వైరల్ గా మారింది.