బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చేయడం లేటెస్ట్ ట్రెండ్. సెలెబ్రిటీలు ఈ తరహా ఫోటో షూట్స్ తో దుమ్మురేపుతున్నారు. టాలీవుడ్ స్టార్ లేడీ కాజల్ సైతం అసలు తగ్గేదేలే అంటుంది. వరుసగా మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చారు. కాజల్ (Kajal Aggarwal) లేటెస్ట్ ఫొటోస్ షూట్ వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు.
27
Kajal Aggarwal
2020 అక్టోబర్ లో వివాహం చేసుకున్న కాజల్ ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టారు . తాను తల్లికాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాజల్ గర్భవతి అన్న విషయం తెలుసుకున్న కాజల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
37
Kajal Aggarwal
ఇక చందమామ గా పిలవబడే కాజల్ కి పుట్టనున్న బిడ్డ ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే దానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది.ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సెలవుల్లో ఉన్న కాజల్ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భర్త కిచ్లు తో పాటు ఇంట్లో వుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.
47
Kajal Aggarwal
ఇక కెరీర్ పరంగా చూస్తే కాజల్ అగర్వాల్ జోరు తగ్గినట్లే అనిపిస్తుంది. ఒప్పుకున్న చిత్రాలు తప్పితే కొత్తగా సైన్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఆఫర్స్ వచ్చినా రాకున్నా కాజల్ కి నష్టమేమీ లేదు. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడిన కాజల్ హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తుంది.
57
Kajal Aggarwal
కాజల్ హీరోయిన్ గా నటించిన మల్టీస్టారర్ ఆచార్య (Acharya)ఏప్రిల్ 29న విడుదల కానుంది.-చిరంజీవి చరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆమె చిరుకు జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు.
67
Kajal Aggarwal
ఇక హిందీలో ఒక చిత్రంతో పాటు, తమిళంలో మూడు చిత్రాల వరకూ నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో అధిక చిత్రాలు చేసిన కాజల్... హిందీలో కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. సౌత్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలిచారు.
77
పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్ వ్యాపార వృద్ధికి కాజల్ తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన నడుపుతున్న సంస్థ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. గృహిణిగా కాజల్ నెరవేరుస్తున్న బాధ్యతలు అబ్బురపరుస్తున్నాయి.