నాగబాబు రాజకీయాలకు వరుణ్ బలి?.... ఎదుగుతున్న సమయంలో గుదిబండలా నెగిటివిటీ!

Published : Apr 11, 2022, 07:16 PM IST

సినిమా వేరు రాజకీయం వీరు. ఈ రెండింటికీ విడదీయరాని సంబంధం ఉన్నప్పటికీ పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో వేరుగా చూడడమే మంచిది. ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోలు, నటులు ఏ ఒక్క పార్టీకి మద్దతు ప్రకటించరు. కారణం అది ఒక వర్గానికి తమని దూరం చేస్తుంది.

PREV
19
నాగబాబు రాజకీయాలకు వరుణ్ బలి?.... ఎదుగుతున్న సమయంలో గుదిబండలా నెగిటివిటీ!
Nagababu -Varun tej


సినిమానా? రాజకీయమా? అనే ప్రశ్న తలెత్తితే జనాలు రాజకీయమే ముఖ్యం అంటారు. తమ అభిమాన పార్టీ, నాయకుడు తర్వాతే ఎవరైనా అంటారు. కాబట్టి జనాలకున్న ఈ బలమైన ఎమోషన్ జోలికి స్టార్స్ వెళ్లరు. అలా రాజకీయాలు పూసుకొని దెబ్బైన స్టార్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 
 

29
Nagababu -Varun tej

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ ఉంది. ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ జనసేన (Janasena) పార్టీ స్థాపించారు. చిరంజీవి పూర్తిగా రాజకీయ సన్యాసం ప్రకటించడంతో జనసేనకు ఆయన పూర్తిగా దూరం. వ్యక్తిగతంగా తమ్ముడు పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే నాగబాబు గత ఎన్నికల నుండి జనసేన పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. 
 

39
Nagababu -Varun tej

2019 సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత నాగబాబు(Nagababu) ఆ పార్టీలో అంత క్రియాశీలకంగా లేరు. ఎప్పటిలాగే టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఇకపై ప్రజా జీవితానికే జీవితం అంకితం అంటూ ఓ భారీ ఎమోషనల్ ట్వీట్ కొట్టారు. ఆల్రెడీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగబాబు కొత్తగా అందుకున్న ఈ కూనిరాగం అర్థం ఏమిటో తెలియలేదు. 
 

49
Nagababu -Varun tej


ఇక జనసేన ఆవిర్భావ సభ వేదికగా అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని 2024లో అధికారంలోకి తెస్తామని వాగ్దానం చేశారు. జనసేన అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న నాగబాబు వైసీపీ పార్టీ (YCP)పై విమర్శల దాడి ఎక్కువ చేశారు. ఈ క్రమంలో సెటైర్స్, పరుష పదాల వాడకం ఎక్కువైంది. 

59
Nagababu -Varun tej


సహజంగానే నాగబాబు తీరు ఓ వర్గంలో తీవ్ర ఆవేశానికి కారణమవుతుంది. మరి మనల్ని విమర్శించే వాళ్ళను, ఇబ్బంది పెట్టే వాళ్ళను దెబ్బ తీయాలనుకోవడం మానవ నైజం. ఈ క్రమంలో వరుణ్ సినిమాలు చూడకూడదని ఓ వర్గం ఫిక్సయింది. వరుణ్ లేటెస్ట్ మూవీ గని (Ghani) విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఈ చర్చ నడిచింది. 
 

69
Nagababu -Varun tej


మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న గని వసూళ్ల పరిస్థితి మనకు తెలిసిందే. రెండో రోజే థియేటర్స్ నుండే ఎత్తేసే పరిస్థితి. సినిమా బాగాలేదు చూడలేదు, అనేది నిజం. అయితే నష్టాన్ని మరింత ఎక్కువ చేసింది ఓ వర్గం. అధికార పార్టీ సానుభూతిపరులు గని మూవీ చూడకూడని నిర్ణయించుకోవడం నిజం. 

79
Nagababu -Varun tej


ఇదే తరహా నష్టం ధరమ్ తేజ్ కి జరిగింది. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన విమర్శలు, రాజకీయ ప్రసంగం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. కంటెంట్ ఉండి కూడా రిపబ్లిక్ మూవీ కనీస వసూళ్లు అందుకోలేదు. ఈ మూవీని ఉద్దేశపూర్వకంగా కొందరు దూరం పెట్టారు. ఇప్పుడు గని చిత్రానికి కూడా ఇదే జరిగిందంటున్నారు కొందరు. 

89

మరి పవన్ (Pawan Kalyan) సినిమాలు ఎందుకు ఆడుతున్నాయంటే? ఆయన ఫ్యాన్ బేస్ వేరు. పూర్తిగా పరిశ్రమలో నిలదొక్కుకున్న హీరో. పార్టీలకు అతీతంగా సినిమా చూస్తారు. అది మిగతా హీరోలకు వర్తించదు. వరుణ్,ధరమ్ మెగా హీరోలైనప్పటికీ పవన్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ సినిమాలు చూడరు. ఒకవేళ చూస్తే ఫస్ట్ డే ఓపెనింగ్ తో వరుణ్ లాంటి హీరో పెట్టుబడికి రెట్టింపు వస్తుంది. పవన్ కూడా ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన గత రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ ఏపీలో నష్టాలు మిగిల్చాయి.

99

ఈ సమీకరణాలన్నీ పరిశీలిస్తే నాగబాబు రాజకీయాలు వరుణ్ (Varun Tej)కెరీర్ ని దెబ్బతీస్తున్నట్లు అనిపిస్తుంది. ఫిదా మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన వరుణ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి హిట్స్ కొట్టారు. గని ఆయన సక్సెస్ జర్నీకి బ్రేక్ వేసింది. మరి ఇదే నెగిటివిటీ కొనసాగితే వరుణ్ భవిష్యత్ అగమ్యగోచరం అని చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories