అమ్మ వాళ్ళ ఇంటికంటే కూడా నిహారికకు అత్తవారి ఇల్లే ఆనందాన్ని ఇస్తుందట. అమ్మనాన్నలు పొద్దున్నే నిద్ర లేవాలని పరిమితులు పెట్టేవారని, అత్తమ్మ మాత్రం అసలు నిద్ర లేపరు అని నిహారిక అన్నారు.
మీ ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ అంటే.. టక్కున తన పేరే చెప్పింది. చైతన్యతో పోల్చితే తనకే కోసం ఎక్కువని నిహారిక చెప్పడం విశేషం. ఇక చైతన్యపై తాను కోప్పడే విషయాన్ని కూడా నిహారిక ప్రేక్షకులతో పంచుకున్నారు.
బెడ్ రూమ్ లోకి వచ్చిన చైతన్య బయటికి వెళ్ళేటప్పుడు.. రూమ్ డోర్ పూర్తిగా వేయకుండా బయటికి వెళ్ళిపోతాడట. బెడ్ పై సేదతీరి ఉన్న నిహారిక.. ప్రత్యేకంగా డోర్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేయాల్సి వస్తుందట.
చైతన్యకి ఉన్న ఆ అలవాటు వలన నిహారిక ఇబ్బంది పడుతున్నారట. అది నచ్చక కొన్నిసార్లు గట్టిగా అరిచేశానని నిహారిక ఉన్న విషయం తెలియజేశారు.
ఇక నిహారిక, చైతన్యలకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అట. ఇద్దరూ కలిసి మంచి ట్రిప్ కి వెళ్లే ప్లాన్ లో ఉన్నట్లు ఇద్దరూ చెప్పారు. పెళ్లి కాకముందు నాన్న టూర్స్ కి అంటే ఒప్పుకునే వారు కాదని.. చైతన్యతో మంచి ట్రిప్స్ కి వెళతానని ఆమె సంబర పడ్డారు.
మొత్తంగా పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికి.. నిహారిక చైతన్య చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. పెళ్లి నిశ్చయం అయినప్పటి నుండి వీరిద్దరూ కలిసి మెలిసి తిరిగారు.
మరో వైపు నిహారిక పెళ్లి తరువాత కూడా చిత్రాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి జంటగా ఆమె నటించిన ఓ బై లింగ్వల్ మూవీ త్వరలో విడుదల కానుంది.
Niharika
అలాగే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తుండగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో యాంకర్ అనసూయ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు.