Charmi:ఆస్తులు పోయినా అవమానాలు ఎదురైనా పూరీని వదలని ఛార్మి... ఆయనతో ఆమె జర్నీ సో అడ్వెంచర్ 

Published : Mar 31, 2022, 01:15 PM ISTUpdated : Mar 31, 2022, 01:17 PM IST

వెండితెరపై వెలిగిపోయాలనే కలలతో 15ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టిన పంజాబీ అమ్మాయి ఛార్మి కౌర్ Charmi Kaur). రెండు దశాబ్దాల కెరీర్ లో ఛార్మి సక్సెస్ ఫెయిల్యూర్స్ చూశారు. ఛార్మి చాలా ఛాలెంజింగ్ జర్నీ చేశారు. ఛార్మి లైఫ్ బిఫోర్ పూరి, ఆఫ్టర్ పూరి అని చెప్పాలి.

PREV
18
Charmi:ఆస్తులు పోయినా అవమానాలు ఎదురైనా పూరీని వదలని ఛార్మి... ఆయనతో ఆమె జర్నీ సో అడ్వెంచర్ 
Charmi kaur

డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh)పరిచయం ఛార్మి జీవితంలో పెను మార్పులు తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఆమె తీరని కష్టాలు, వైఫల్యాలు, ఆర్ధిక ఇబ్బందులు, అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంత కష్టం వచ్చినా పూరితో ప్రయాణాన్ని ఆమె ఆపలేదు. 
 

28


2015లో విడుదలైన జ్యోతిలక్ష్మీ చిత్రానికి పూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఛార్మి లీడ్ రోల్ చేశారు. అలాగే పూరితో కలిసి ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. జ్యోతిలక్ష్మీ ఆశించిన విజయం సాధించలేదు. 
 

38

పూరి కనెక్ట్స్ బ్యానర్ లో భాగస్వామిగా ఛార్మి చిత్రాలు నిర్మించారు. ఛార్మి నిర్మాతగా రోగ్, పైసా వసూల్, మెహబూబ్ చిత్రాలు నిర్మించారు. ఇవన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పూరి, ఛార్మి ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఛార్మి నటిగా సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకుంది. 
 

48


పోయిన చోటే వెతుక్కోవాలనే విషయం బాగా తెలిసిన పూరి-ఛార్మి ఉన్న ఆస్తులు, ఇళ్ళు కూడా అమ్ముకొని ఇస్మార్ట్ శంకర్ మూవీ తీశారు. ఇస్మార్ట్ శంకర్ భారీ సక్సెస్ కావడంతో ఛార్మి మరలా కోలుకున్నారు. రామ్ హీరోగా 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. 

58
Charmi kaur

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో ఛార్మి దశ తిరిగింది. కోల్పోయినవన్నీ మరలా పొందారు. హిట్ ట్రాక్ ఎక్కిన పూరీకి విజయ్ దేవరకొండ మూవీ ఛాన్స్ ఇచ్చారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ లైగర్(Liger) నిర్మాణ భాగస్వామి కావడంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. లైగర్ రిజల్ట్ రాకుండానే విజయ్ దేవరకొండ పూరితో JGM చిత్రానికి సైన్ చేశారు.

68
Charmi kaur


లైగర్, JGM చిత్రాలకు ఛార్మి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఛార్మికి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం. ఈ రెండు చిత్రాల తర్వాత ఛార్మి ఆర్ధికంగా మరింత బలంగా మారె అవకాశం కలదు. 
 

78
Charmi kaur

పూరి స్నేహంతో ఛార్మి ఆర్థిక బాధలే కాకుండా అవమానాలు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. పూరి వరుస ఫెయిల్యూర్స్ కి ఛార్మినే కారణం అంటూ కొందరు ఆరోపణలు చేశారు. నటి హేమ పూరీని ఛార్మి మబ్బులా కమ్మేసింది, అందుకే ఆయన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటూ ఓపెన్ కామెంట్ చేసింది. అలాగే ఛార్మి పూరితో పాటు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

88
Charmi kaur


అలాగే పూరితో ఛార్మికి ఉన్న బంధంపై అనేక పుకార్లు ఉన్నాయి. పూరి వైఫ్ ఛార్మిని ఈ విషయంలో నిలదీశారని, ఆమెపై చేయి చేసుకున్నారనే కథనాలు కూడా వెలువడ్డాయి. పూరితో స్నేహం తర్వాత ఛార్మి ఇలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఆరోపణలు ఎదురైనా ఛార్మి ఆయన్ని మాత్రం వదల్లేదు. 
 

click me!

Recommended Stories