Janaki Kalaganaledu: షాకింగ్ ట్విస్ట్.. విడాకులు తీసుకోనున్న జానకి, రామచంద్ర.. ఆలోచనలో పడ్డ జ్ఞానాంబ!

Published : Mar 31, 2022, 12:42 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ఉమ్మడి కుటుంబ  అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: షాకింగ్ ట్విస్ట్.. విడాకులు తీసుకోనున్న జానకి, రామచంద్ర.. ఆలోచనలో పడ్డ జ్ఞానాంబ!

చిన్న ఇంట్లో జానకి (Janaki) రామచంద్రలు చాప పై పడుకుంటారు. ఆ క్రమంలో రామచంద్ర గుండెలపై జానకి తన చేయి వేస్తుంది. దాంతో రామచంద్ర (Ramachandra) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు. మరుసటి రోజు జానకి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉండగా శ్రావణి  అక్కడికి వచ్చి అసలు ఈ ఇల్లు ఏంటీ ఈ పొయ్యి ఏంటి ఈ అవస్థలు ఏమిటి అని అడుగుతుంది.
 

26

దాంతో జానకి (Janaki) మా ఆడపడుచు పెళ్లి విషయంలో మా అత్తయ్య గారితో ఒక చిన్న అపార్థం ఎదురైంది అందువల్ల ఈ ఇంట్లో ఉన్నాను అని చెబుతుంది. ఇక శ్రావణి (Sravani) మీ అత్తయ్య గారు ఎంత మూర్ఖురాలో నాకు తెలుసు అని అంటుంది. అంతేకాకుండా నా మాట విని విడాకులు ఇచ్చేయ్ అని అంటుంది.
 

36

ఇక ఆ మాటతో జానకి (Janaki) శ్రావణి అంటూ గట్టిగా అరిచి.. కుటుంబం అన్నాక ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయా.. ఎందుకు ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడతావు అని అంటుంది. ఇక శ్రావణి యోగికి ఫోన్ చేసి ఇక్కడ జానకి పరిస్థితి ఏం బాలేదు అని చెబుతుంది. దాంతో యోగి (Yogi)  నేను ఈరోజే ఇండియాకు బయలుదేరి వస్తాను అని అంటాడు.
 

46

ఇక జానకి రామచంద్ర (Ramachandra) భోజనం తీసుకుని వెళుతూ ఉండగా కార్ఖానాలో కూలి పని చేస్తున్న మీ భర్తకి భోజనం చేసి వెళ్తున్నావా అని నీలావతి (Neelavathi) దెప్పి పొడుస్తుంది. ఇక అదే క్రమంలో అత్తా కోడళ్ళ కి వినపడేలా ఊళ్ళోవాళ్ళు అనుకోనే పుకార్ల గురించి దెప్పి పొడుస్తు ఉంటుంది.
 

56

ఇక ఇంటికి వచ్చిన జ్ఞానాంబ (Jnanaamba) తో మల్లిక వగలు పడుతూ ఏడుస్తూ మీ పెద్దబ్బాయి కి జానకి విడాకులు ఇచ్చేస్తుంది అత్తయ్యగారు అని ఏడుస్తుంది. దీంతో జ్ఞానాంబ ఆలోచిస్తుండగా గోవిందరాజు (Govinda Raju) అది నిజం కాదని కొట్టి పడేస్తాడు.
 

66

ఆ తర్వాత రామచంద్ర (Ramachandra)  జానకి సర్దుకు వచ్చిన భోజనాన్ని తినకుండా కింద పడేస్తాడు. అది జ్ఞానాంబ (Jnanaamba) కూడా గమనిస్తుంది. కానీ రామచంద్ర భోజనము ఎందుకు పడేస్తాడో రేపటి భాగం లో తెలుసుకోవాలి.

click me!

Recommended Stories