సినిమాలో హీరో మంచి వాడు, అందరికి సహాయం చేస్తాడు, మంచి పనులే చేస్తాడు, చెడుపై పోరాటం చేస్తాడనేది పాత నానుడి. ఒకప్పటి ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు విజయాలు సాధించాయి. మంచి వసూళ్లని రాబట్టాయి. కానీ నేడు అవి బోర్ కొడుతున్నాయి. అయితే ఇప్పుడు హీరో విలన్ అయితే, ఓ క్రిమినల్ అయితే మాత్రం ఎగబడి చూస్తున్నారు. అలాంటి సినిమాలే ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. బన్నీ, యష్, కమల్ హాసన్, మహేష్, పవన్ వంటి స్టార్లు నెగటివ్‌గా కనిపించిన సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి.