ఢిల్లీ భామా రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ మూవీల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
26
తెలుగులో తను నటించిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేశాడు. గోపీచంద్ (Gopichand) ప్రధాన పాత్రలో నటించారు. రాశీఖన్నా హీరోయిన్ గా అందాలు ఆరబోసింది.
36
ఈ చిత్రంతో అటు గోపీచంద్, ఇటు రాశీఖన్నా ఎలాగైనా హిట్ కొట్టాలనే హోప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాఖీ ఖన్నా మరియు గోపీచంద్ కూడా ‘పక్కా కమర్షియల్’లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
46
అదేవిధంగా మ్యూజిక్ ట్రాక్స్ కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాయి. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర యూనిట్ ఆడియెన్స్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా రీచ్ పెరిగేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జూలై 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
56
ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా రాశీ ఖన్నా ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. తన అందచందాలతో నెటిజన్లు ఆకర్షిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు లేటెస్ట్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
66
పిక్స్ లో రాశీ ఖన్నా మరీ స్లిమ్ గా కనిపిస్తోంది. ఎల్లో కలర్ బాడీ కాన్ డ్రెస్ లో మతిపోగొడుతోంది. మత్తెక్కించే ఫోజులతో ఢిల్లీ బ్యూటీ రెచ్చిపోయింది. యంగ్ బ్యూటీ అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెవర్ బిఫోర్ గ్లామర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్ లు చేస్తూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.