ఇష్టపడి కొన్న కారును అమ్మకానికి పెట్టిన దళపతి విజయ్.. కారణం ఏంటో తెలుసా..?

First Published | Aug 3, 2024, 5:39 PM IST

పాపం విజయ్ దళపతి...ఎంతో ఇష్టంగా ఓ కారును కొన్నాడు.. ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆ కారును ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం విజయ్ చేసిన ఆతప్పేనా..? 

TVK Vijay

​​​​​​తమిళ స్టార్ హీరో విజయ్ ను వివాదాలు వదలడంలేదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుని ఇబ్బందిపడుతూనే ఉన్నాడు విజయ్. హీరోగా స్టార్ డమ్ చూశాడు.. కోట్ల రెమ్యునరేషన్ చూశాడు.. లగ్జరీ లైఫ్ కూడా చూశాడు కాని.. అంతే వివాదాలు కూడా మూటగట్టుకున్నాడు. రీసెంట్ గా పొలిటికల్ పార్టీ ప్రకటించిన విజయ్ కు.. ఈమధ్యలోనే పాత వివాదాలు కూడా బయటకు వస్తున్నాయి. 

ఎంతో ఇష్టపడి ఆ కారును ఫారెన్ నుంచి  దిగుమతిచేసుకున్న విజయ్.. దానికి టాక్స్ కట్టకపోవడంతో.. వివాదంలో చిక్కుకున్నాడు. దానికోసం కోర్టుల చుట్టూ తిరిగాడు. న్యాయమూర్తితో మొట్టికాయలు కూడా తిన్నాడు. అయితే కొన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ స్టార్‌ హీరో.. ఇక ఆ కారుతో ఇబ్బందుులు ఎందుకు అనుకున్నాడో ఏమో..  ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టాడు. తమిళ స్టార్ హీరో  దళపతి విజయ్‌.. ఎంతో మోజుపడి  2012లో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారును కొన్నాడు.  అత్యంత ఖరీదైన ఆ లగ్జరీ కారును అమెరికా నుంచి తెప్పించుకున్నాడు. 


நடிகர் விஜய்

అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకోన్న కారుకు ఇండియాలో లోకల్‌ టాక్స్‌ కట్టడం తప్పనిసరి. అయితే ఆ టాక్స్ ను విజయ్  కట్టలేదనే ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. దాంతో విజయ్  ఈ విషయంపై  కోర్టును కూడా ఆశ్రయించారు. కాని అక్కడ కూడా విజయ్ కే తిట్లు చీవాట్లు పడ్డాయి.  2021, జూలై 13న ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్‌ న్యాయస్థానం.. విజయ్‌కు లక్ష జరిమానా కూడా విధించింది. 

Thalapathy Vijay

విజయ్ కు విధించిన ఫైన్ లక్ష మొత్తాన్ని అప్పట్లో  ముఖ్యమంత్రి కొవిడ్‌ రిలిఫ్‌ ఫండ్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలనికూడా ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. ఆతరువాత విజయ్ కారుకు కట్టాల్సిన ట్యాక్స్‌ 40 లక్షలు చెల్లించాడని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. అయితే అప్పటికే విజయ్ వివాదం అవ్వడంతో పరువుపోయినట్టు అయిపోయింది. ఇక ఆ కారువల్ల వచ్చినసమస్యలు చాలు అనుకున్నాడో ఏమో..  విజయ్‌ ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన కారును అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. 

విజయ్ ప్రేమగా కొన్న కారు అమ్మేస్తున్నాడన్న విషయం ప్రస్తుతం  తమిళనాడులో సంచలనంగా మారింది. దళపతి ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అంటూ రోల్స్‌రాయ్స్‌ కారు ఫొటోను ఎంపైర్‌ ఆటోస్‌ కార్‌ డీలర్‌షిప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర 2.6 కోట్లు అని, అయితే ఇది ఫిక్స్ రేట్ కాదని.. కొనేవారి పరిస్థితిని బట్టి రేటు మారుతుందని అంటున్నారు. 

ఇక విజయ్ రకరకాల వివాదాలతో ఇబ్బందిపడుతున్నారు. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు అని ఓన్యూస్ వైరల్ అవ్వగా.. కుటుంబంతో విడిగా ఉంటున్నారని.. హీరోయిన్ త్రిషను పెళ్ళాడబోతున్నారని.. అది తన రాజకీయ జీవితానికి పెద్ద ఇబ్బందిగా మారబోతుందంటూ.. రకరకాల వార్తలు ఆయనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక విజయ్ డైరెక్ట్ గాపోటీకి దిగిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!