ఒకసారి బిగ్ బాస్ లోకి వెళితే అమ్మాయిలకు అంత సులభంగా సినిమా అవకాశాలు రావు అంటూ ఇనయ బాంబు పేల్చింది. అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం ఇనయ చెప్పలేదు. ఇనయ మాత్రమే కాదు.. సిరి హనుమంత్, శోభా శెట్టి, హమీద, అరియనా లాంటి వాళ్లంతా బిగ్ బాస్ లో బాగా పాపులర్ అయినవాళ్లే. గ్లామర్ షోలో కూడా వీళ్ళెవరూ తగ్గరు. అయినప్పటికీ వీళ్లెవరికి హీరోయిన్లగా ఆఫర్స్ రాలేదు. అంటే సినిమా అవకాశాలు ఆశపడి బిగ్ బాస్ లోకి వెళ్లే అమ్మాయిలకు ఇది డేంజర్ బెల్ లాంటిదే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ 8 లోకి వచ్చే మహిళా కంటెస్టెంట్స్ ఎవరు ? వారి జాతకం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ఆల్రెడీ మొదలైపోయింది.