10 నెలల్లో ఇండస్ట్రీ హిట్ ని లేపేసిన కుర్ర హీరో ఏమయ్యాడు.. దెబ్బకి చిరంజీవి, నాగ్, పవన్ రికార్డులు అవుట్ 

Published : Feb 15, 2025, 03:57 PM IST

ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ కెరీర్ ని సుదీర్ఘ కాలం కాపాడుకోవడమే కష్టం. ఇండస్ట్రీలో ఉవ్వెత్తున ఎగసిన చాలా మంది హీరోలు త్వరగా కెరీర్ ని ముగించారు.

PREV
15
10 నెలల్లో ఇండస్ట్రీ హిట్ ని లేపేసిన కుర్ర హీరో ఏమయ్యాడు.. దెబ్బకి చిరంజీవి, నాగ్, పవన్ రికార్డులు అవుట్ 
Chiranjeevi, Nagarjuna, Pawan Kalyan

ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ కెరీర్ ని సుదీర్ఘ కాలం కాపాడుకోవడమే కష్టం. ఇండస్ట్రీలో ఉవ్వెత్తున ఎగసిన చాలా మంది హీరోలు త్వరగా కెరీర్ ని ముగించారు. సిద్దార్థ్ కి గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. తరుణ్ సినిమాలు చేయడమే మానేశాడు. ఉదయ్ కిరణ్ జీవితం ఎలా ముగిసిందో చూశాం. 

25

తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరుణ్.. హీరో అయ్యాక తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. తరుణ్ నటించిన తొలి చిత్రం నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2000 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్ర వసూళ్లు చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. 

35
నువ్వే కావాలి

ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ చిత్రం రిలీజ్ కి 10 నెలల ముందే జనవరిలో ఒక ఇండస్ట్రీ హిట్ నమోదైంది. వెంకటేష్, సిమ్రాన్ నటించిన కలిసుందాం రా చిత్రం సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం 10 నెలల వ్యవధిలోనే తరుణ్ నువ్వే కావాలి .. కలిసుందాం రా చిత్ర రికార్డుల్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. 

45
Venkatesh

కలిసుందాం రా చిత్రం 19 కోట్ల వసూళ్లు రాబట్టగా.. నువ్వే కావాలి మూవీ 19.5 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అంతే కాదు ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నువ్వే కావాలి చిత్రం నిలిచింది. ఆ ఏడాది సూపర్ హిట్స్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ బద్రి, నాగార్జున నువ్వొస్తావని, చిరంజీవి అన్నయ్య లాంటి చిత్రాలని బీట్ చేస్తూ నువ్వే కావాలి టాప్ లో నిలిచింది. 

55

అదే విధంగా తరుణ్ 2002 లో నటించిన నువ్వు లేక నేను లేను చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది. అలాంటి సంచలనాలు సృష్టించిన తరుణ్ ఇప్పుడు కనీసం ఇండస్ట్రీలో కనిపించడం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories