కన్నకొడుకు దూరమైనా కనికరించని నందమూరి కుటుంబం, తారకరత్న భార్యకు కష్టాలు, ఇంత కఠినమా?

First Published Jul 6, 2024, 8:46 AM IST


తారకరత్న మరణంతో ఒంటరైన అలేఖ్యరెడ్డికి కష్టాలు కొనసాగుతున్నాయి. కొడుకు మరణం తర్వాత కూడా ఆమెను నందమూరి కుటుంబం దగ్గరకు తీయలేదు. ఈ మేరకు అలేఖ్య లేటెస్ట్ సోషల్ మీడియా కామెంట్ ఆమె దీన స్థితిని తెలియజేస్తుంది. 
 

Taraka Ratna Wife Alekhya Reddy

తారకరత్న మరణం ఊహించని విషాదం. చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు. 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కుప్పం వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇరవై రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు.

Taraka Ratna Wife Alekhya Reddy

తారకరత్న 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు. ఆ మూవీ మ్యూజికల్ హిట్. అరంగేట్రంతోనే 9 సినిమాలు లాంచ్ చేసి తారకరత్న రికార్డు నెలకొల్పాడు. అయితే తారకరత్న స్టార్ కాలేకపోయారు. వరుస పరాజయాలతో ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. 
 

Latest Videos


Taraka Ratna Wife Alekhya Reddy

2012లో తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా అత్యంత మిత్రుల సమక్షంలో తారకరత్న-అలేఖ్య ల వివాహం జరిగింది. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

Taraka Ratna Wife Alekhya Reddy

 
అలేఖ్యను తారకరత్న పేరెంట్స్ అంగీకరించలేదు. కులాలు వేరు కావడంతో పాటు అలేఖ్యకు గతంలో వివాహం జరిగింది. తారకరత్నతో ఆమెకు రెండో వివాహం. కుటుంబం దూరం పెట్టడంతో తారకరత్న అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. 
 

Taraka Ratna Wife Alekhya Reddy

తారకరత్న-అలేఖ్యలకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తారకరత్న మరణం అలేఖ్య జీవితాన్ని కుదిపేసింది. ఆమె మరింత ఒంటరి అయ్యారు. కొడుకు మరణం తర్వాత కూడా తారకరత్న తండ్రి మోహన కృష్ణ కోడలిని, పిల్లలను చేరదీయలేదని తెలుస్తుంది. తాజాగా అలేఖ్య చేసిన సోషల్ మీడియా కామెంట్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 
 

Taraka Ratna Wife Alekhya Reddy


అలేఖ్య తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియా చాట్ చేశారు. ఓ అభిమాని... ఇప్పటికైనా తారకరత్న పేరెంట్స్ మిమ్మల్ని అంగీకరించారా? అడిగారు. దీనికి సమాధానంగా... ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడుపుతాయి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగాము. తారకరత్న ఎప్పుడు ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. 
 

నేను కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా ఒకరోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది... అని కామెంట్ చేసింది. అలేఖ్య సమాధానం ప్రకారం తారకరత్న తల్లిదండ్రులు ఆమెను ఇప్పటికీ అంగీకరించలేదు. తన కష్టంతోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఈ క్రమంలో తారకరత్న పేరెంట్స్ హృదయాలు అంత కఠినమా? కనీసం పిల్లల కోసమైనా దగ్గరకు తీసుకోవాలిగా అంటున్నారు. 
 

click me!