స్టార్ డైరెక్టర్ కొడుకుతో ప్రేమాయణం...  నటి హేమ లవ్ స్టోరీ తెలుసా?

Published : May 27, 2024, 04:25 PM IST

గత వారం రోజులుగా నటి హేమ పేరు మారుమ్రోగుతుంది. రేవ్ పార్టీ కేసులో ఆమె ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో హేమ వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ డైరెక్టర్ కొడుకుని హేమ ప్రేమించి పెళ్లి చేసుకుంది.   

PREV
16
స్టార్ డైరెక్టర్ కొడుకుతో ప్రేమాయణం...  నటి హేమ లవ్ స్టోరీ తెలుసా?

బెంగుళూరు వేదికగా జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని సమాచారం. తాను బెంగుళూరు వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో బైట్ విడుదల చేసింది. హేమ అబద్దం చెప్పారని తెలుస్తుంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. 

26
reva party hema

హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆ పేరుతోనే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఫార్మ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న అధికారులు దాడి చేశారు. దాదాపు వంద మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. వారిలో హేమ ఒకరు. రేవ్ పార్టీలో నిషేదిత ఉత్ప్రేరకాలు ఉపయోగించారు. పరీక్షల కోసం బ్లడ్ శాంపిల్స్ సైతం సేకరించారు. 

 

36
Actress Hema

మే 27న హేమ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం. రేవ్ పార్టీ కేసు కారణంగా హేమ పేరు మారుమ్రోగుతుండగా ఆమె వ్యక్తిగత విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఓ డైరెక్టర్ కొడుకుని హేమ ప్రేమ వివాహం చేసుకుంది. 

46
Hema

హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. అతని తండ్రి ఒక దర్శకుడు. అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. సయ్యద్ జాన్ అహ్మద్ వృత్తి రీత్యా కెమెరా మెన్. హేమ దూరదర్శన్ లో చేస్తున్న రోజుల్లో సయ్యద్ జాన్ అహ్మద్ కూడా అక్కడే పని చేసేవాడట. 

56
Hema

ఒకరోజు నేరుగా వెళ్లి పెళ్లి చేసుకుంటావా అని హేమను సయ్యద్ జాన్ అహ్మద్ అడిగాడట. పేమిస్తున్నాను అని కాకుండా పెళ్లి చేసుకుంటావా? అని అడగడంతో హేమకు నమ్మకం కలిగిందట. అలా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారట. హేమ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. పేరు ఈషా. 

 

66
rave party hema

ఆంధ్రప్రదేశ్ రాజోలులో జన్మించిన హేమ 1989లో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆమె మొదటి చిత్రం బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ ఆమె మొదటి చిత్రం. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ వందల చిత్రాల్లో నటించారు . ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. సిల్వర్ స్క్రీన్ పై తక్కువగా కనిపిస్తుంది. 

click me!

Recommended Stories