ఇటీవల ఇంటర్వ్యూలో సిద్దార్థ్ తన ఆవేదన బయట పెట్టాడు. బొమ్మరిల్లు చిత్రం అన్ని విషయాల్లో సూపర్ సక్సెస్ అయింది. కానీ ఆ మూవీ విషయంలో నాకొక బాధ ఉంది. ఆ చిత్రానికి చాలా నంది అవార్డులు వచ్చాయి కదా.. ఒక్క మనిషికి మాత్రం ఆ చిత్రంలో నంది అవార్డు రాలేదు. అది నేనే. బొమ్మరిల్లు చిత్రంలో నిర్మాత దిల్ రాజు, ప్రకాష్ రాజ్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, జెనీలియా, అబ్బూరి రవి వీళ్ళందరికీ వివిధ విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. కానీ సిద్దార్థ్ కి మాత్రం నంది ఇవ్వలేదు అనేది వస్తావం.