బాల భారతం షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో గల హొగెనక్కల్ వాటర్స్ ఫాల్స్ వద్ద జరుగుతుందట. షాట్ గ్యాప్ లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్స్ ఆ వాటర్ ఫాల్స్ లో మునిగేవారట. శ్రీదేవి ఒక రాడ్డును పట్టుకుని వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తుందట. ఆ పక్కనే ధర్మరాజు, అర్జునుడు పాత్రలు చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు కూడా స్నానం చేస్తున్నారట.