స్టార్ రైటర్ కోనా వెంకట్ అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన సమర్పణలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టైటిల్ తో హారర్ కామెడీ డ్రామా తెరకెక్కింది. అంజలి ప్రధాన పాత్రలో నటించగా శ్రీనివాసరెడ్డి, సత్య, అలీ, షకలక శంకర్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు.
26
Kona Venkat
2014లో ఇదే కాంబినేషన్ లో వచ్చిన గీతాంజలి సూపర్ హిట్. ఈ సిరీస్లో తెరకెక్కిన రెండో చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కోనా వెంకట్ తో పాటు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
36
Adhurs Movie
కోనా వెంకట్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తానని ఆయన బల్లగుద్ది చెప్పారు. కోనా వెంకట్ కామెంట్స్ ఒకింత ఆసక్తి రేపాయి. 2010లో విడుదలైన అదుర్స్ సూపర్ హిట్ గా ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహించగా కోనా వెంకట్ రచయితగా పని చేశారు.
46
Adhurs Movie
అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్రలో బ్రహ్మణుడిగా నటించి మెప్పించారు. అదుర్స్ సినిమాకు ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్స్ హైలెట్ అని చెప్పాలి. బ్రాహ్మణుడు పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అదుర్స్ 2 ఉంటుంది చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.
56
Adhurs Movie
తాజాగా కోనా వెంకట్ మాట్లాడాడు. అదుర్స్ 2 ఖచ్చితంగా చేస్తాము. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి పిలక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన చారి పాత్ర టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఏ నటుడు నటుడు చేయలేడు. స్లాంగ్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతఙ్గమా చేశాడని అన్నారు.
66
మరి ఎలాగైనా ఒప్పించి ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాను అంటున్న కోనా వెంకట్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకులతో బిజీగా ఉన్నారు. ఆయన కోనా వెంకట్, వివి వినాయక్ లతో పని చేస్తాడని చెప్పలేం. చేసినా దానికి చాలా సమయం పడుతుంది..