హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిద్ధార్థ్ ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
సీనియర్ నటుడు, హీరో సిద్ధార్థ్, యంగ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి సీక్రెట్ గా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి లవ్ ట్రాక్ పై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా సిద్ధార్థ్, అతిది డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
26
ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్, అదితి ప్రేమలో మునిగి తేలుతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం అవుతోంది.
36
మరోవైపు వీరిద్దరూ జంటగా షికారు చేయడం, సినిమా ఈవెంట్లకు కూడా కలిసి వెళ్లడంతో సీక్రెట్ లవ్ నిజమనే భావన కలుగుతోంది. దీనిపై ఇంతవరకు ఈ స్టార్స్ స్పందించలేదు. కానీ రీసెంట్ గా సిద్ధార్థ్ పోస్ట్ చేసిన పిక్ ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
46
రెండు రోజుల కింద అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ప్రత్యేకంగా విష్ చేశారు. అంతేకాకుండా తన అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ ద్వారా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
56
అంతేకాకుండా, ఓ ప్రేమ కావ్యాన్ని కూడా రాసుకొచ్చారు. ‘హృదయాన్ని దోచిన యువరాణి అదితి రావు హైదరీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నువ్వు కన్న చిన్న, పెద్ద కలలన్ని ఎప్పుడూ నిజం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరింతగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని విష్ చేశాడు.
66
దీంతో వీరి లవ్ ట్రాక్ నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్టు సిద్దార్థ్ ఈ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చారని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఆమె బర్త్ డే రోజున కూడా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.