పెద్ద ఎత్తున ఉపాసన-రామ్ చరణ్ ల కూతురు బారసాల ఏర్పాట్లు... పేరు ఇదేనా!

Published : Jun 30, 2023, 10:35 AM ISTUpdated : Jun 30, 2023, 10:40 AM IST

పెద్ద ఎత్తున చరణ్-ఉపాసనల కూతురు బారసాల ఏర్పాట్లు... పేరు ఇదేనా!

PREV
15
పెద్ద ఎత్తున ఉపాసన-రామ్ చరణ్ ల కూతురు బారసాల ఏర్పాట్లు... పేరు ఇదేనా!

జూన్ 20న ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ లో ఉపాసనకు డెలివరీ అయ్యింది. రాత్రి 1:49 నిమిషాలకు అమ్మాయి పుట్టిందట. మంగళవారం నాడు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 
 

25
Ram Charan Daughter naming ceremony

అనంతరం రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారు. అభిమానుల దీవెనలు కృతజ్ఞతలు చెప్పారు. కూతురికి ఏం పేరు పెడుతున్నారని అడగ్గా... ఆల్రెడీ పేరు అనుకున్నాము. సాంప్రదాయంగా నిర్వహించే వేడుకలు ఆ పేరు బహిర్గతం చేస్తామని అన్నారు. ఇక కూతురుది ఎవరి పోలికని అడగ్గా ఖచ్చితంగా నా పోలికే అని ఛలోక్తులు వదిలారు. 


 

35
Ram Charan Daughter naming ceremony

కాగా నేడు చరణ్ దంపతులు బారసాల వేడుక నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉపాసన సమాచారం ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో బారసాల ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. లక్షలు ఖర్చు చేసి ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు. బారసాల వేడుక కోసం కావలసిన వస్తువులు తీసుకొచ్చారు. ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు. 

45


ఇవాళ ఉపాసన-రామ్ చరణ్ దంపతుల కూతురు పేరుపై సందిగ్దత వీడనుంది. మంగళవారం పుట్టింది. చిరంజీవికి హనుమంతుడు ఇష్టదైవం. కాబట్టి ఉపాసన కూతురు పేరు కచ్చితంగా హనుమంతుడు నామం కలిసేలా ఉంటుందని ఒక అంచనా ఉంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర పడనుంది. 

 

55

2012లో రామ్ చరణ్-ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళై పదేళ్లు అవుతున్నా రామ్ చరణ్ దంపతులు పేరెంట్స్ కాలేదు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పదేళ్ల వరకు పిల్లలు వద్దని తాము నిర్ణయించుకున్నట్లు ఉపాసన ఇటీవల వెల్లడించారు. 

click me!

Recommended Stories