అయితే పెళ్లి చేసుకున్న వెంటనే పదేళ్ల వరకు పిల్లలు కనకూడదని చరణ్, ఉపాసన నిర్ణయం తీసుకున్నారట. దానికి కట్టుబడే ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదట. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. లలితా సహస్రనామం లోని క్లిన్ కార అనే పదాన్ని పేరుగా పెట్టారు. క్లిన్ కార రాకతో మెగా కుటుంబంలో అనేక శుభాలు చోటు చేసుకోవడం విశేషం.