కృష్ణంరాజుని తొక్కేసేందుకు దర్శక, నిర్మాత కుట్ర.. ఆవేశంలో వేసేద్దామని వెళ్లిన ప్రభాస్‌ తండ్రి.. ఏం జరిగింది?

Published : Jul 21, 2024, 02:44 PM IST

కృష్ణంరాజుని తొక్కేసేందుకు అప్పట్లో పెద్ద కుట్ర జరిగిందట. అది చూసిన ప్రభాస్‌ తండ్రి ఏకంగా వారిని చంపేయాలని ఊగిపోయాడట. ఆ కథేంటో చూద్దాం.   

PREV
16
కృష్ణంరాజుని తొక్కేసేందుకు దర్శక, నిర్మాత కుట్ర.. ఆవేశంలో వేసేద్దామని వెళ్లిన ప్రభాస్‌ తండ్రి.. ఏం జరిగింది?

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ ల తర్వాత ఇండస్ట్రీని ఏలిన హీరోల్లో ఒకరు. కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు వీరంతా సమకాలీకులుగా రాణించారు. యాంగ్రి యంగ్‌ మేన్‌గా నటించి మెప్పించారు. అదే ఆయన్ని రెబల్‌ స్టార్‌ని చేసింది. 1966లో ఇండస్ట్రీలో వచ్చి మొదట చిన్న చిన్న వేషాలు వేశారు. ఆ తర్వాత విలన్‌గానూ చేశారు. నెమ్మదిగా నటుడిగా పుంజుకుని బ్యానర్‌ పెట్టుకుని హీరోగా నిలబడ్డాడు. 
 

26

కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది. కానీ సినిమాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. దీంతో ఆయన ప్రారంభంలో అందరిలాగే సినిమా కష్టాలు పడ్డారు. తనని తాను నిరూపించుకుని ఇండస్ట్రీలో కమాండ్‌ వచ్చాక నిర్మాణ సంస్థని పెట్టి హీరోగా నిలబడ్డాడు. తనని తాను హీరోగా నిలబెట్టుకున్నాడు, రెబల్‌ స్టార్ గా ఎదిగాడు.  
 

36

ఇదిలా ఉంటే హీరోగా రాణిస్తున్న సమయంలో కృష్ణంరాజుని తొక్కేసేందుకు కుట్ర జరిగిందట. ఆయన్ని అన్‌ పాపులర్‌ చేసే ప్రయత్నాలు జరిగాయట. ఈ క్రమంలో ఓ నిర్మాత తనని ఓ సినిమా కోసం బుక్‌ చేసుకున్నాడు. 20వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వేరే హీరోని తీసుకున్నారట. దర్శకుడు, నిర్మాత కలిసి కుట్ర చేశారు. అందులో భాగంగానే కృష్ణంరాజుని తీసేశారు. అడ్వాన్స్ డబ్బులు తిరిగి తీసుకునేందుకు వాళ్లు పెద్ద డ్రామా ఆడారట. అప్పట్లో పెద్దమనిషిగా వ్యవహరించిన నిర్మాత డీవీఎస్‌ రాజు వద్ద పంచాయితీ పెట్టారట. ఆయన ఫోన్‌ చేయడంతో వెళ్లిన కృష్ణంరాజు. ఆయన ముందే విషయం తేల్చేశాడు. 
 

46

సదరు నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. కానీ వాళ్లు మీటింగ్‌ పెట్టుకుని తనపై చేస్తున్న కుట్రని ఆపేయాలని వార్నింగ్‌ ఇచ్చాడట కృష్ణంరాజు. అయితే ఆ మీటింగ్‌ గురించి ముందే కృష్ణంరాజు తమ్ముడు, ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజుకి తెలిసింది. దీంతో ఆయన ఊగిపోతున్నాడు. దొరికితే చంపేయాలనేంత కోపంతో ఉగిపోతున్నాడట. అప్పటికీ తాను చెప్పినా వినడం లేదు. దీంతో డీవీఎస్‌ రాజుని హెచ్చరించారు కృష్ణంరాజు. ఆ సదరు నిర్మాత చేస్తున్న కుట్ర ఆపకపోతే నా తమ్ముడు నా చేతుల్లోనూ ఉండడు, ఆ తర్వాత జరిగే పరిణామాలను మీరే బాధ్యులు అని చెప్పారట. ఆ తర్వాత ఆయన విషయాన్ని సెట్‌ చేశారని, అంతేకాదు వారి బ్యానర్‌లో సినిమాలు ఇకపై చేయనని కూడా తెగేసి చెప్పాడట కృష్ణంరాజు. 

56

అప్పట్లో ఈ సంఘటన తనని బాగా బాధపెట్టిందని, చాలా రోజులు డిస్ట్రర్బ్ అయినట్టు తెలిపారు కృష్ణంరాజు. రెండు మూడు రోజులు నిద్ర పోలేదన్నారు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు కృష్ణంరాజు. ఆ నిర్మాత పేరు జీఎస్‌ రాజు అని వెల్లడించారు కృష్ణంరాజు. కొన్నేళ్ల క్రితం చేసిన ఓల్డ్ ఇంటర్వ్యూ ఇది. ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌ తండ్రి అప్పట్లో నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణంరాజు స్థాపించిన గోపీకృష్ణ బ్యానర్‌ని ఆయనే నిర్వహించేవారు. అన్నకి బ్యాక్‌ బోన్‌లా ఉండేవాడు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు. 

66

కృష్ణంరాజు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన నటనా వారసత్వాన్ని ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియాస్టార్‌, ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని రాణిస్తున్నారు. ఇటీవల ప్రభాస్‌ చేసిన `కల్కి 2898 ఏడీ` సంచలన విజయం సాధించింది. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆయన చేతిలో `ది రాజాసాబ్‌`, `స్పిరిట్‌`, హను రాఘవపూడి మూవీ, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలున్నాయి. తెలుగులోనే కాదు, ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్ గా రాణిస్తున్నారు ప్రభాస్. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories