మెగా ఫ్యామిలీలో మరో పండగ... పెళ్లి పీటలు ఎక్కుతున్న ఆ యంగ్ హీరో?

First Published | Jun 13, 2024, 6:43 PM IST

మెగా ఫ్యామిలీలో గత ఏడాది కాలంగా వరుస పండగలు, శుభకార్యాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వేడుకకు రంగం సిద్ధమైంది అంటున్నారు. ఆ మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడట. అమ్మాయి ఎవరంటే?
 

క్లిన్ కార కడుపులో పడ్డప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో శుభాలు చోటు చేసుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. రామ్ చరణ్ కొన్ని అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 
 

అనంతరం వరుణ్ తేజ్ తన ప్రేయసిని పెళ్లాడాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఏళ్లుగా ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ 2023 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం ఇటలీ దేశంలో ఘనంగా ఐదు రోజులు జరిగింది. వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకకు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 


వీటన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన భాగస్వామిగా ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీకి వెళ్లడమే కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. 

కాగా మెగా ఫ్యామిలీలో మరో వేడుక చోటు చేసుకోనుందని సమాచారం అందుతుంది. హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడని సమాచారం. చిరంజీవి చెల్లెలు కొడుకైన సాయి ధరమ్ 'రేయ్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే రేయ్ మూవీ విడుదల ఆలస్యం కావడంతో పిల్లా నువ్వు లేని జీవితం ముందు విడుదలైంది. 

సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ కెరీర్లో సూపర్ హిట్ గా ఉంది. బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఏడాది కాలం నటనకు దూరం అయ్యాడు. విరూపాక్ష చిత్రంతో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయ్యాడు. మామయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో టైటిల్ తో మల్టీస్టారర్ చేశాడు. 

37 ఏళ్ల సాయి ధరమ్ కి పెద్దలు పెళ్లి సంబంధం చూశారట. అమ్మాయి ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందినదట. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపుకున్నారట. త్వరలో సాయి ధరమ్ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారట. ఘనంగా ఎంగేజ్మెంట్, అనంతరం కొన్ని నెలలకు పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. 

Latest Videos

click me!