విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా రీమేక్ చిత్రాలు చేసేవారు. అనంతరం అత్యధికంగా పవన్ కళ్యాణ్ రీమేక్స్ లో నటించారు. పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ హిట్, ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ స్టార్డమ్ తెచ్చిన చిత్రాలు కూడా రీమేక్స్ కావడం విశేషం. ఆయన ఎక్కువగా తమిళ చిత్రాలు రీమేక్ చేశారు. పవన్ తన కెరీర్ లో రీమేక్ చేసిన 11 చిత్రాలు వాటి ఫలితాలు ఏమిటో చూద్దాం..
Happy Birthday Pawan Kalyan
పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత. ఇది తమిళ చిత్రం గోకులత్తిల్ సీతైకి అధికారిక రీమేక్. ఉమనైజర్ గా పవన్ రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగివుంటుంది. 22 ఆగస్టు 1997న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అప్పటి టాప్ దర్శకులలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.
పవన్ మూడవ చిత్రంతో హిట్ అందుకోగా... ఇది కూడా రీమేక్. విజయ్ హీరోగా 1997లో విడుదలైన లవ్ టుడే చిత్రానికి తెలుగు రీమేక్ గా సుస్వాగతం తెరకెక్కింది. పవన్ కెరీర్ లో ఫస్ట్ హిట్ సుస్వాగతం. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. ఈ చిత్రంలోని సాంగ్స్ జనాలకు బాగా నచ్చాయి.
Happy Birthday Pawan Kalyan
ఖుషి చిత్రం పవన్ ఇమేజ్ డబుల్ చేసింది. సిద్దు సిద్ధార్థ రాయ్ అంటూ.. పవన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఖుషి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. పవన్ తన ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖుషి చిత్రంతో అందుకున్నారు. 2001లో విడుదలైన ఖుషీ... తమిళ చిత్రం ఖుషి కి రీమేక్. ఎస్ జే సూర్య దర్శకుడు. భూమిక గ్లామర్, మణిశర్మ పాటలు సినిమా విజయంలో కీలకంగా మారాయి.
ఖుషీ తర్వాత ఐదేళ్లు పవన్ రీమేక్స్ జోలికి వెళ్ళలేదు. 2006లో అన్నవరం చిత్రాన్ని తమిళ్ రీమేక్ గా చేశారు. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన అన్నవరం యావరేజ్ గా నిలిచింది. ఒరిజినల్ లో విజయ్ హీరో.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తీన్ మార్ చిత్రంలో నటించారు పవన్ కళ్యాణ్. ఇది హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్' కి అధికారిక రీమేక్. ఈ సినిమా పవన్ కి పెద్ద షాక్ ఇచ్చింది. పవన్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయడం విశేషం.
ప్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్న పవన్ కళ్యాణ్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ హిందీ చిత్రం దబంగ్ రీమేక్. ఈ మూవీతో పవన్ కొత్త రికార్డ్స్ నమోదు చేశాడు.
Happy Birthday Pawan Kalyan
పవన్ కెరీర్ లో తెరకెక్కిన 7వ రీమేక్ గోపాల గోపాల. వెంకీ మరో హీరోగా నటించారు. ఇది హిందీ చిత్రం ఓహ్ మై గాడ్ రీమేక్. పవన్ దేవుడి పాత్ర చేశారు. అయితే గోపాల గోపాల యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
తమిళ హిట్ మూవీ వీరం కి రీమేక్ గా తెరకెక్కింది కాటమరాయుడు. 2017లో తెరకెక్కిన కాటమరాయుడు పవన్ కెరీర్ లో అట్టర్ ప్లాప్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
అజ్ఞాతవాసి మూవీ తర్వాత పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ 2019 చివర్లో తన కమ్ బ్యాక్ ప్రకటించారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ ఎంచుకున్నారు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ చిత్రం చేశారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక పవన్ పదవ రీమేక్ భీమ్లా నాయక్. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది భీమ్లా నాయక్ మంచి ఓపెనింగ్స్ అందుకుంది. గత ఏడాది విడుదలైన బ్రో సైతం తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఈ మూవీ యావరేజ్.