రాంచరణ్ ని చూద్దామని వెళ్లి ఏడ్చేసిన స్టార్ ప్రొడ్యూసర్, ఆ మాట చెప్పి వచ్చేశాడట

First Published | Sep 2, 2024, 1:42 PM IST

ఒక సినిమా మీరు ఎలా జడ్జ్ చేస్తారు.. సినిమా హిట్టా ఫ్లాపా అని ముందే గ్రహిస్తారా అని యాంకర్ ప్రశ్నించగా డివివి దానయ్య సమాధానం ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక చరణ్ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనుంది. రాంచరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో ఈ మూవీ తెరకెక్కబోతోంది. 

రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే. డివివి దానయ్య రీసెంట్ గా నానితో సరిపోదా శనివారం చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

Latest Videos


ఒక సినిమా మీరు ఎలా జడ్జ్ చేస్తారు.. సినిమా హిట్టా ఫ్లాపా అని ముందే గ్రహిస్తారా అని యాంకర్ ప్రశ్నించగా డివివి దానయ్య సమాధానం ఇచ్చారు. కథ విని ఆ మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చెప్పగలను. దర్శకుడిని కూడా అంచనా వేయగలను. కానీ కొన్ని సార్లు మన జడ్జిమెంట్ తప్పు కావచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని దానయ్య అన్నారు. 

చాలా సినిమాలకు నా అంచనా తప్పలేదు. రాంచరణ్ గారిని ఒకసారి కలుద్దామని ఆయన షూటింగ్ లో బిజీగా ఉంటే అక్కడికి వెళ్ళాను. ఒక సన్నివేశం చూశాను. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వెంటనే రాంచరణ్ తో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్ అని చెప్పా. ఆ మూవీ మరేదో కాదు రంగస్ధలం. 

నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ చనిపోయే సీన్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడే అనిపించిందని అయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనుకున్నా. వెంటనే నా ఆఫీస్ కి తిరిగి వచ్చా. కొరటాల శివ గారు ఉన్నారు. ఆయనకి కూడా చెప్పా. రాంచరణ్ పెద్ద హిట్ కొట్టబోతున్నారు.. ఇప్పుడే షూటింగ్ చూసి వస్తున్నా అని కొరటాలతో అన్నాను. నేను చెప్పినట్లుగానే రంగస్థలం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చూడండి అని అన్నారు. 

రాజమౌళికి 2006లోనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆయనపై నాకు గట్టి నమ్మకం. దేశాన్ని శాసించే డైరెక్టర్ అవుతారని తెలుసు. అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్యాలెంట్ ని కూడా కెరీర్ బిగినింగ్ లోనే గమనించినట్లు డివివి దానయ్య తెలిపారు. 

click me!