బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీని రీమేక్ చేస్తున్న ఎన్టీఆర్... ఆ మూవీ మీ ఊహకు కూడా అందదు!

First Published | Mar 15, 2024, 8:25 AM IST

బాబాయ్ బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఓ చిత్రాన్ని ఎన్టీఆర్ రీమేక్ చేయనున్నారట. మరి అదే జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఆ సినిమా  ఏమిటీ?
 

నందమూరి ఫ్యామిలీ మూడు తరాలుగా టాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. లెజెండ్ ఎన్టీఆర్ నట వారసత్వం కొనసాగుతుంది. ఇక ఎన్టీఆర్ నటించిన కొన్ని చిత్రాలు ఆయన కుమారుడు బాలయ్య రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 
 

సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రాన్ని బాలకృష్ణ పాండురంగడు టైటిల్ తో రీమేక్ చేశారు. కాగా బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఓ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేస్తారంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 


Balakrishna

బాలకృష్ణ అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. వాటిలో జానపద చిత్రంగా తెరకెక్కింది భైరవద్వీపం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1994లో విడుదలైన భైరవద్వీపం బ్లాక్ బస్టర్. రోజా ప్రధాన హీరోయిన్. రంభ గెస్ట్ రోల్ చేసింది. 
 

Balakrishna

భైరవ ద్వీపం సక్సెస్ లో మాధవపెద్ది సురేష్ అందించిన సాంగ్స్ కీలకం అయ్యాయి. సింగీతం శ్రీనివాసరావు తన టెక్నీక్స్ తో సిల్వర్ స్క్రీన్ పై మాయాజాలం చేశాడు. భైరవద్వీపం బాలయ్య కెరీర్లో గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ రీమేక్ చేస్తారట. 

Balakrishna


భైరవద్వీపం ఇప్పుడు చేయాలంటే భారీ బడ్జెట్ కావాలి. అలాగే ఆ సబ్జెక్టు ని సరిగ్గా డీల్ చేసే దర్శకుడు దొరకాలి. భైరద్వీపం రీమేక్ చేయడం అంత సులభం కాదు. ఈ రోజుల్లో ఆ మూవీ చేయాలంటే కనీసం మూడు నాలుగేళ్ళ సమయం పడుతుంది. భారీగా విఎఫ్ఎక్స్ వర్క్ పై పని చేయాల్సి ఉంటుంది. 

వీటన్నింటికీ మించి ఇప్పుడు బాలయ్య-ఎన్టీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎన్టీఆర్ మీద తన కోపాన్నీ బాలయ్య నేరుగానే చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. బాలయ్య, ఎన్టీఆర్ ల కోల్డ్ వార్ నేపథ్యంలో భైరవద్వీపం రీమేక్  అనేది జరగని పని. ఇవన్నీ నిరాధార పుకార్లే అని చెప్పవచ్చు... 

Latest Videos

click me!