పోయి పోయి చిరంజీవితో పెట్టుకున్న ఎన్టీఆర్, ఆచార్య వివాదం తెరపైకి!

First Published | Sep 11, 2024, 9:20 AM IST

దేవర ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ఎన్టీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ చిరంజీవిని పరోక్షంగా విమర్శిస్తున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారు?
 

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా దేవర తెరకెక్కిస్తున్నారు. దేవర పార్ట్ 1 విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ రిలీజ్ చేశారు. ముంబై లో జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు.

Devara Trailer

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొరటాల శివ మైండ్ లో ఎప్పుడూ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు సినిమా కథ, సన్నివేశాల గురించి బుర్రపెట్టి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో సరైన స్థలం, మనుషులు ఆయన పక్కన ఉండాలి. అప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, అన్నారు. 
 

Latest Videos


NTR - Chiranjeevi

ఎన్టీఆర్ తన కామెంట్స్ ద్వారా ఆచార్య మేటర్ పరోక్షంగా తెరపైకి తెచ్చాడనే వాదన మొదలైంది. ఆచార్య ఫెయిల్యూర్ కి ఆయన పక్కన ఉన్న మనుషులే కారణం అన్నట్లు ఎన్టీఆర్ కామెంట్స్ ఉన్నాయి. దర్శకుడు కొరటాలకు ఆచార్య అతి పెద్ద డిజాస్టర్. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. 

ఆచార్య దారుణ పరాజయం నేపథ్యంలో చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండు మూడు సందర్భాల్లో కొరటాల శివను టార్గెట్ చేసి మాట్లాడారు. కొరటాల పూర్తి శ్రద్ధ పెట్టి ఆ సినిమా తీయకపోవడం వలనే పరాజయం పొందిందన్న అర్థంలో చిరంజీవి మాట్లాడారు. చిరంజీవి కామెంట్స్ పై కొరటాల శివ ఏనాడూ స్పందించలేదు. ఆచార్య మూవీ వలన కొరటాల శివ ఆస్తులు అమ్ముకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆయన ఆచార్య బిజినెస్ వ్యవహారాల్లో తలదూర్చి నష్టపోయాడని వినికిడి. 
 

NTR - Chiranjeevi

క్రమేణా ఆచార్య వివాదం సమసిపోయింది.ఎన్టీఆర్ కామెంట్స్ తో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఎన్టీఆర్ వ్యాఖ్యలపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాటలకు పెడర్థాలు తీస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 
 

కాగా దేవర మూవీ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దర్శకుడు కొరటాల దాదాపు కథ చెప్పేశాడు. కథలో పెద్దగా మేటర్ అయితే లేదు. గతంలో చాలా సినిమాల్లో ఈ తరహా కథలు జనాలు చూశారు. అయితే విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ బీజీఎం హైలెట్ గా ఉంది. కొరటాల దేవరను ఎలా తీర్చిదిద్దాడు అనేది చూడాలి.   
 

ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. జాన్వీకి ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఆమె కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పొచ్చు. దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ సౌత్ లో జెండా పాతినట్లే. ఆర్సీ 16కి కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. దేవర ఫలితం ఎన్టీఆర్ కి చాలా ఇంపార్టెంట్. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

మరోవైపు బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ వర్గాలు దేవర మూవీపై నెగిటివ్ ప్రచారం మొదలెట్టారు. మెగా ఫ్యాన్స్ తో కలిసి దేవర ట్రైలర్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో దేవర మూవీని గట్టిగా దెబ్బ తీయాలని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది.

click me!