గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరో నితిన్.. ఇంత భయంకరంగా ఉన్నాడేంటి..

Published : Nov 17, 2022, 04:10 PM IST

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు.

PREV
16
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరో నితిన్.. ఇంత భయంకరంగా ఉన్నాడేంటి..

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు. డెబ్యూ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.   

 

26

దీనితో నితిన్ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మంగళవారం రోజు సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీనితో అభిమానులు, సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులంతా కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నితిన్ కూడా కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

 

36

అభిమానులు ఎప్పుడూ నితిన్ ని హ్యాండ్సమ్ లుక్ లోనే చూస్తుంటారు. కానీ కృష్ణగారికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన నితిన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

 

46

నితిన్ ఎప్పుడూ అవసరమైన మేరకు మాత్రమే గడ్డం పెంచుతాడు. లై చిత్రం కోసం నితిన్ పొడవైన గడ్డంలుక్ లో కనిపించాడు. లేటెస్ట్ లుక్ లో నితిన్ భయంకరమైన రూపంతో కనిపిస్తున్నాడు. గుబురుగా గడ్డం పెరిగిపోయి ఉంది. నితిన్ ఇలా మారిపోయాడు ఏంటి అంటూ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

 

56

తన కొత్త చిత్రం కోసం ఏదైనా వెరైటీ లుక్ ట్రై చేస్తున్నాడా లేక సహజంగానే ఇలా గడ్డం పెంచాడా అని చర్చించుకుంటున్నారు. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 

 

66

నితిన్ తదుపరి.. తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన యువదర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన కథలో కొంచెం మార్పులు చేసి నితిన్ తో మూవీ చేసేందుకు వెంకీ కుడుముల రెడీ అవుతున్నారట. 

 

click me!

Recommended Stories