తన స్ట్రగులింగ్ లైఫ్, ఫెయిల్యూర్ కెరీర్ గురించి చెబుతూ, ఫెయిల్ వచ్చినప్పుడు తనలో రెట్టింపు కసి పెరుగుతుందని, సినిమా పోయిందని డిప్రెషన్ ఫీలవడమనేది జరగదని, ఆ బాధతో లోపలు దిగమింగి కసిగా మరో సినిమా చేయాలని, హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉంటానని తెలిపారు. నెక్ట్స్ సినిమాల లైనప్ తెలిపారు నిఖిల్. ప్రస్తుతం `స్పై` అనే రా ఏజెంట్ మూవీ చేస్తున్నానని, పూర్తి యాక్షన్ మూవీ అని, నేషనల్ పాయింట్‌తో నెవర్ బిఫోర్ లా ఉండే కథతో రాబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సుధీర్ వర్మతో మరో సినిమా చేస్తున్నానని తెలిపారు. `ఇండియా హౌజ్` అనే ఫిల్మ్ చేస్తున్నానని, ఓ పీరియాడిక్ మూవీ ఉందన్నారు. రాబోతున్న వాటిలో చాలా ఎగ్జైటింగ్ స్టఫ్ ఉందన్నారు.