విరాట పర్వం మూవీ చూసి రివ్యూ ఇచ్చిన హీరో నిఖిల్.. ఎపిక్ లవ్ స్టోరీ, అంత బావుందా..

Published : Jun 09, 2022, 02:17 PM IST

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

PREV
16
విరాట పర్వం మూవీ చూసి రివ్యూ ఇచ్చిన హీరో నిఖిల్.. ఎపిక్ లవ్ స్టోరీ, అంత బావుందా..

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్  డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. 

26

ఈ చిత్ర రిలీజ్ కు ఇంకా వారం రోజులు ఉంది. జూన్ 17న విరాట పర్వం రిలీజ్ కి రెడీ అవుతోంది. యంగ్ హీరో నిఖిల్ ముందుగానే ఈ చిత్ర స్పెషల్ షో వీక్షించాడు. విరాట పర్వం మూవీ నిఖిల్ కి తెగ నచ్చేసినట్లు ఉంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చాడు. 

36

'ఇప్పుడే విరాట పర్వం మూవీ చూశాను. ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ.. చూస్తున్నంత సేపు షాక్ అయ్యా, ఆశ్చర్యానికి గురయ్యా. రానా , సాయి పల్లవి కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఊడుగులకి, నిర్మాత సుధాకర్ చెరుకూరి హ్యాట్సాఫ్' అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. 

46

నిఖిల్ కామెంట్స్ సినిమాపై హైప్ పెంచేలా ఉన్నాయి. రానా ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ప్రేమ కథగా వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

 

56

ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై  అంచనాలు పెంచే విధంగా ఉంది. రానా, సాయి పల్లవి స్టోరీ థీమ్ కి తగ్గట్లుగా నటనలో చెలరేగిపోయారు. దీనితో ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. జూన్ 17న సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 

66

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. నివేత పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర , నందిత దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories