50 లక్షలిస్తే హీరోను చేస్తానని మోసం చేశారు, ఆ డైరెక్టర్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న నిఖిల్

Published : Dec 24, 2022, 05:42 PM IST

తన జీవితం అంత ఈజీగా సాగిపోలేదంటున్నాడు యంగ్ హీరో నిఖిల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి..పాన్ ఇండియా హీరోగా ఎదిగిన యంగ్ స్టార్.. హీరో అవ్వడానికి ఎన్ని కష్టాడు పడింది వివరంగా వెల్లడించాడు. 

PREV
16
50 లక్షలిస్తే హీరోను చేస్తానని మోసం చేశారు, ఆ డైరెక్టర్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న నిఖిల్

హీరోలు, హీరోయిన్లు ఎంత లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారో అనిపిస్తుంటుంది. కాని ఆ లైఫ్ వెనకాల చాలామంది కష్టం దాగి ఉంటుంది. వారసత్వంగా వచ్చిన వారు మొదటి నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించి ఉంటారు కాని.. కష్టపడి టాలెంట్ తో .. స్వతహాగా హీరోలు అయిన వారి వెనకాల మాత్రం ఎన్నో అవమానాలు, మోసాలు తప్పవు. అలాంటి సంఘటలన గురించే వివరిచాడు యంగ్ హీరో నిఖిల్. 

26

బయట మోసాలు ఎలా జరుగుతాయో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతకురెట్టింపు మోసాలు తప్పవు. ఇండస్ట్రీలో కూడా మోసగించి డబ్బలాగేవారు చాలా మంది.  కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఇలాంటి మోసగాళ్ల బారిన పడ్డాడు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా వెల్లడించాడు. 
 

36

నిఖిల్ తాజాగా 18 పేజెస్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బ్లాక్ బస్టర్ అనలేం కాని ఓ మోస్తర్ హిట్ తో ఆకట్టుకుంటుంది సినిమా. అయితే ఈమూవీ రిలీజ్ కు ముందు  ప్రమోషన్స్ లో జోరుగా పాల్గోన్నాడు నిఖిల్. వచ్చిన ఏ ఛాన్స్ ను వదిలిపెట్టలేదు టీమ్. ఈక్రమంలో ఓ ఈవెంట్ లో తన ఫిల్మ్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించాడు. 
 

46

శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ చిత్రంతో పరిచయం అయిన నిఖిల్ అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఓ సీరియల్ కూడా చేశాడు. ఈ విషయం చెప్పిన  నిఖిల్. బుల్లితెరపైనే ఉంటే తన కల నిజం కాదని, సినిమాల కోసం ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టానన్నాడు.  తన నటన నచ్చినా కొందరు ఇన్ ప్లుయన్స్ వల్ల..  అవకాశాలు ఇవ్వలేదని. తనకు రావల్సిన అవకాశాలు వెరేవాళ్లకు వెళ్లిపోయాయాన్నాడు యంగ్ స్టార్. 

56

ఇక   50 లక్షలు ఇస్తే హీరోను చేస్తామని కొందరు చెప్పడంతో 5 లక్షల వరకూ కష్టపడి తెచ్చిఇచ్చానని నిఖిల్ వెల్లడించాడు. కానీ, అందులో  లక్ష ఖర్చుతో షూటింగ్ చేసి తర్వాత షూటింగ్ ఆపేసి.. కనిపించకుండా పోయారని వెల్లడించాడు నిఖిల్. తన జీవితంలో అది అతి పెద్ద మోసమన్నారు. తాను మోసపోయానని తెలుసుకుని  మానసికంగా ఎంతో బాధపడ్డానన్నారు నిఖిల్.  
 

66

తాను ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చకున్నా.. వరుస హిట్లు కొడుతున్నా.. అది ముందుగా తనకు మంచి అవకాశం ఇచక్చిన అది డైరెక్టర  శేఖర్ కమ్ముల కే దక్కుతుందన్నారు. ఆయన  హ్యాపీడేస్ లో అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలో నిలబడ్డానని. ప్పాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకు ఆదరణ లభిస్తోందన్నాడు. 

click me!

Recommended Stories