చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

First Published Sep 16, 2020, 8:30 AM IST

భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు. 

సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు చిరంజీవి గారు. తన నటనతో, డ్యాన్సుతో, స్టైల్ తో అందరిని అలరిస్తూసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు చిరంజీవి.అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు.
undefined
చిరంజీవి గారు సాధారణ ప్రేక్షకుల నుంచి మొదలుకొని ప్రస్తుతం ఉన్న యువ హీరోల వరకు ఎందరికో అభిమాన నటుడిగా మారడమే కాకుండా.... వారందరికీ చిత్రల్లోకి రావడానికి ఒక స్ఫూర్తి గా కూడా నిలిచారు. ఇప్పటికి అనేక ఇంటర్వ్యూల్లో ఎందరో ఆర్టిస్టులు తమ ఇన్స్పిరేషన్ గా చిరంజీవిగారిని పేర్కొనడం మనం చూసిందే.
undefined
తాజాగా క్రేజీ యంగ్ హీరో, అందాల రాక్షసితో తెలుగులో డెబ్యూ చేసి మంచి హిట్ అందుకొని, మొన్ననే విడుదలైన భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు.
undefined
ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్ర చిరంజీవి గారిపై తనకున్న అభిమానం గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. విద్యార్ధి దశలో చిరంజీవి గారి సినిమా విడుదలైతే షర్ట్ విప్పి డాన్సు వేయడం దగ్గరినుండి.... సినిమా బాక్స్ తెచ్చేనందుకు తాముచేసే సాహసకృత్యాలనుకూడా వివరించాడు. (Pic Credit: ETVTeluguIndia)
undefined
తెలుగువాడైన నవీన్ చంద్ర పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ... పెరిగింది మాత్రం బళ్లారిలో. గాలి జనార్దన్ రెడ్డి పొరుగింట్లోనే ఉండేవాడట. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే సాగింది. బళ్ళారి పేరుకే కర్ణాటకలో ఉన్నప్పటికీ... అక్కడ అన్ని తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మన తెలుగు సినిమాలకు అది పెద్ద మార్కెట్.
undefined
బళ్లారి కర్ణాటక రాష్ట్రానికి చెందినదే అయినప్పటికీ.... మన టాలీవుడ్ కలెక్షన్స్ లో అది కూడా ఒక భాగం. సీడెడ్ ప్రాంతం కలెక్షన్స్ లో రాయలసీమతోపాటుగా మనం బళ్ళారి కలెక్షన్స్ ని కూడా కలిపి లెక్కగడుతాము. ఇలాంటి ప్రాంతంలో పెరిగిన నవీన్ చంద్రకు చిన్నప్పటినుండి సినిమాపై వ్యామోహం పెరిగింది.
undefined
చిరంజీవికి వీరాభిమాని. యువకుడిగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన నవీన్ చంద్ర చిరంజీవి సినిమాకోసం అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునే వాడు. ఇప్పుడంటే సినిమా సాటిలైట్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. కానీ అప్పట్లో బాక్స్ ద్వారా షో నడిచేది.
undefined
ఆ కాలంలో చిరంజీవి సినిమా బాక్స్ ను గుంతకల్ నుండి బళ్లారికి తీసుకురావడానికివారు చేసే సాహస కార్యాలను వివరించాడు నవీన్. ఎక్కడైనా వేర్వేరు హీరోల ఫ్యాన్స్కి మధ్య గొడవలు సహజం. వ్యక్తిగతంగా వైరం కాకున్నప్పటికీ.... ఆధిపత్యం కోసం నడిచే ఒక మినీ సంగ్రామం ఇది.
undefined
ఇదే తరహాలో తమ ఊరిలో కూడా చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే.... టైం కి షో పడనివ్వొద్దని వేరే హీరోఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తుంటే.... ఖచ్చితంగా టైం క్లి షో పడేందుకు చిరంజీవి ఫ్యాన్స్ చూసే వారట. ఊరికి సినిమా బాక్స్ ను టైం కి తీసుకురాకుండా అడ్డుకునేవారట యాంటీ ఫ్యాన్స్. సినిమా షో టైం కి పడే బాధ్యతను భుజానికి ఎత్తుకునేవాడట నవీన్ చంద్ర.
undefined
ఇందుకోసం స్ప్లెండర్ ప్లస్ బండి పై అతడు అతని మిత్రుడు పొలాల గట్ల మీద నుండి చెట్లల్లో, తుప్పల్లో వెళ్లి 59 కిలోమీటర్ల దూరంలోని గుంతకల్ చేరుకునేవారట. (బళ్లారికి బాక్స్ గుంతకల్ నుంచి రావాలి). గుంతకల్ లో బాక్స్ తీసుకొని అవతలి వర్గానికి దొరకకుండా థియేటర్ కి చేరుకునేవారట. ఎలాంటి కష్టమైనా భరించి షో టైం కి ప్రదర్శితమయ్యేలా చూసేవాడట.
undefined
అలా షో పడగానే షర్ట్ తీసేసి థియేటర్ లో డాన్స్ వేసేవాడట నవీన్ చంద్ర. సినిమాల్లోకి చిరంజీవి స్ఫూర్తితోనే వచ్చానని చెప్పిన నవీన్ చంద్ర ఆ రోజుల్లో చిరంజీవి సినిమా కోసం చెప్పిన సాహస కృత్యాలు ఆసక్తిని కలిగించాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలయింది. పూర్తి ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారమవనుంది.
undefined
click me!