ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్: శబరిమలలో ఒక సామాన్యుడిలా హీరో నాని!  

First Published | Dec 3, 2024, 3:48 PM IST

అయ్యప్ప మాల ధరించిన నాని శబరిమల వెళ్లారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.  దీనికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫోటోలు ఏషియా నెట్ కి లభించాయి. 
 

Hero Nani

హీరో నానికి ఆధ్యాత్మికత ఎక్కువే. ఆయన అయ్యప్ప భక్తుడని సమాచారం. కాగా నాని అయ్యప్ప మాల ధరించారు. ఇక దీక్ష పూర్తి చేయడం కోసం శబరిమల వెళ్లారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. 

Hero Nani

తోటి భక్తులు శబరిమలలో హీరో నానిని గుర్తించారు. ఆయనతో ఫోటోలు దిగారు. అలాగే శబరిమలలో చేయాల్సిన పూజలు, పునస్కారాలు నాని పూర్తి చేశాడు. నాని శబరిమల దర్శనానికి వెళ్లిన ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా ఏషియా నెట్ కి లభించాయి. ఆ ఫోటోలు మీరు చూడొచ్చు. 


Hero Nani

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా నానితో ఉన్నారు. ఆయన కూడా ఫోటోలకు పోజిచ్చారు. తొలిప్రేమ ఫేమ్ నటి వాసుకి భర్తనే ఈ ఆనంద్ సాయి. ఇక దీక్ష ముగిసిన అనంతరం నాని సినిమా షూటింగ్స్ లో బిజీ కానున్నారు. 

ప్రస్తుతం నాని.. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నారు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. పార్ట్ వన్ లో విశ్వక్ సేన్, పార్ట్ 2 లో అడివి శేష్ నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. 

హిట్ 3 మూవీలో నాని జమ్మూ కాశ్మీర్ స్టేట్ పోలీస్ గా కనిపిస్తున్నారు. ఎస్పీ అర్జున్ సర్కార్ గా సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము లేపనున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. నాని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. నాని ఓ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్. విశ్వక్ సేన్, అడివి శేష్ సైతం ఈ పార్ట్ లో కనిపిస్తారు. సమ్మర్ కానుకగా 2025 మే 1న విడుదల కానుంది. 

హిట్ సిరీస్ కి నాని నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన నాని.. చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిట్ 3తో పాటు నాని మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారని సమాచారం. దసరా చిత్రంతో నానికి భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తో రెండో మూవీ చేస్తున్నారట. హిట్ కాంబో రిపీట్ కానుందట. కాగా బలగం ఫేమ్ వేణుతో నాని ఒక మూవీ చేయాల్సి ఉండగా.. క్యాన్సిల్ అయ్యింది. 

Latest Videos

click me!